Telangana- AP CMs: ఇరు రాష్ట్రాల సీఎంల స‌మావేశానికి ముహూర్తం ఖ‌రారు.. వేదిక‌గా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌..!

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారిని విష‌యం ఏదైనా ఉందంటే.. అది ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల (Telangana- AP CMs) భేటీనే.

  • Written By:
  • Updated On - July 5, 2024 / 04:18 PM IST

Telangana- AP CMs: తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారిని విష‌యం ఏదైనా ఉందంటే.. అది ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల (Telangana- AP CMs) భేటీనే. గ‌త కొన్ని రోజులుగా స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అవుతుంది ఈ టాపిక్‌. ఇరు రాష్ట్రాల సీఎంలు తొలిసారి భేటీకి రావ‌డంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే జూలై 6వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశానికి ముహూర్తం ఖ‌రారైంది. తెలంగాణ‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ ఇరు రాష్ట్రాల సీఎంల స‌మావేశానికి వేదిక కానుంది. ఇప్పటికే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అన్ని ర‌కాల ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ మంత్రులు. అయితే ఈ భేటీ త‌ర్వాత చాలా విష‌యాల‌పై క్లారిటీ వ‌స్తుంద‌ని రాజ‌కీయ పండితులు చెబుతున్నారు.

అయితే ఉమ్మ‌డి ఏపీ విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావటం ఇదే మొదటిసారి కావ‌డం విశేషం. ఈ స‌మావేశంలో ప్రధానంగా షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం.. తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. ఈ విష‌యంపై ఓ క్లారిటీ రానుంది.

Also Read: Sabitha Indra Reddy: బీఆర్‌ఎస్‌లోనే సబితా, క్లారిటీ వచ్చేసింది

కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైన విష‌యం తెలిసిందే. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి.

షెడ్యూల్‌ 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. అయితే వీట‌న్నింటికి రేపు సీఎం చంద్ర‌బాబు, రేవంత్‌ల స‌మావేశం త‌ర్వాత ఓ కొలిక్కి వ‌స్తాయ‌ని తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ వ‌ర్గాల్లోనూ.. అటు కూట‌మి ప్ర‌భుత్వంలోనూ సీఎంల స‌మావేశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

We’re now on WhatsApp : Click to Join