Site icon HashtagU Telugu

Niti Aayog’s Report: టాప్-3 రాష్ట్రాల్లో తెలంగాణకు స్థానం

Telangana

Telangana

దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కర్ణాటక, హర్యానాతో పాటు తెలంగాణ మొదటి మూడు రాష్ట్రాలుగా నిలిచాయి. నీతి ఆయోగ్ రూపొందించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021’ ను రిలీజ్ చేసింది.  సబ్‌నేషనల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్, సామర్థ్యాల ఆధారంగా ప్రధాన రాష్ట్రాలను ప్రకటించింది. ఈ మేరకు గురువారం న్యూఢిల్లీలో సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ సమక్షంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ ఈ సూచీని విడుదల చేశారు.

‘ప్రధాన రాష్ట్రాలు’ విభాగంలో కర్ణాటక మళ్లీ అగ్రస్థానంలో ఉండగా, ‘నార్త్ ఈస్ట్ అండ్ హిల్ స్టేట్స్’ విభాగంలో మణిపూర్ అగ్రస్థానంలో ఉండగా, ‘కేంద్రపాలిత ప్రాంతాలు, నగర రాష్ట్రాలు’ విభాగంలో చండీగఢ్ అగ్రస్థానంలో ఉందని సూచీ పేర్కొంది. ఇంకా, వేగవంతమైన పట్టణీకరణ పరంగా, మొత్తం ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లోలో 38 శాతంతో రాష్ట్రాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) గ్రహీతలలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో తెలంగాణ ఉండటంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Exit mobile version