Site icon HashtagU Telugu

Telangana: వ్యాక్సినేషన్ లో ‘తెలంగాణ’ రికార్డ్

Covid

Covid

100 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ మార్క్‌ను సాధించడానికి తెలంగాణ సిద్ధమైంది. 18 ఏళ్లు పైబడిన అర్హులైన లబ్ధిదారులకు మొదటి, రెండో డోసుల వ్యాక్సినేషన్ అందిస్తుండటంతో కొద్దిరోజుల్లోనే వందశాతం రికార్డు దిశగా ముందుకెళ్తోంది. మొదటి డోస్ 100 శాతం కవరేజీని సాధించడానికి అధికారులకు దాదాపు తొమ్మిది నెలలు పట్టింది. ఇక అర్హులైనవాళ్లకు కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ కార్యక్రమం ఈ నెలలో పూర్తవుతుందని భావిస్తున్నారు. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న లబ్ధిదారులందరికీ మొదటి డోస్‌ను అందించిన భారతీయ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ శాతంతో పోల్చినప్పుడు.. తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో రెండవ డోస్ కవరేజీ 96 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు 89 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ.

ప్రస్తుతం, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 2,77,67,000 మంది వ్యక్తులకు తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ టీకా కేంద్రాలు 2,93,52,699 మొదటి డోస్‌ను అందించాయి. కాగా తెలంగాణలో టీనేజర్స్ వ్యాక్సినేషన్ ప్రకియ కూడా వేగవంతమవుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సినేషన్ లో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఇప్పటికీ కరోనా తీవ్రత పూర్తిగా తగ్గలేదని.. అందుకు చైనా, హాంకాంగ్‌, అమెరికాలో కేసుల పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. కరోనా కట్టడికి ఏకైక మార్గం టీకాలే  అని అన్నారు.