Telangana: వీధికుక్కల దాడిలో గొర్రెలు మృతి.. భారీగా నష్టం

తెలంగాణ (Telangana)లో వీధికుక్కలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలోని కడ్డంపెద్దూరు మండలం అంబారిపేట్ గ్రామంలో ఆదివారం వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి.

  • Written By:
  • Publish Date - April 2, 2023 / 01:04 PM IST

తెలంగాణ (Telangana)లో వీధికుక్కలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలోని కడ్డంపెద్దూరు మండలం అంబారిపేట్ గ్రామంలో ఆదివారం వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి. కొండవేని కొమురయ్యకు చెందిన గొర్రెల మందపై తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందగా, ఐదు గొర్రెలకు గాయాలయ్యాయి. గాయపడిన గొర్రెలు విషమంగా ఉన్నాయని కొమురయ్య తెలిపారు. ఒక్కో గొర్రె రూ.50 వేలకు పైగా పలుకుతుందని తెలిపారు. వీధి కుక్కల బెడద ఆందోళన కలిగిస్తోందని స్థానికులు తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: Covid Cases: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 6 నెలల్లో ఇవే అత్యధికం..!

మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో గొర్రెల మందపై వీధికుక్కలు దాడి చేసిన ఘటనలో 33 గొర్రెలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన చిట్టవేని నర్సయ్యకు చెందిన గొర్రెలమందపై కుక్కలు దాడిచేసాయి. ఈ ఘటనలో నర్సయ్యకు మూడున్నర లక్షల నష్టం వచ్చినట్లు సమాచారం. వీధికుక్కలు ఒక్కసారిగా గొర్లమందపై పడి దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా నష్టపోయిన నర్సయ్యను ప్రభుత్వమే ఆదుకోవాలని యాదవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.