Site icon HashtagU Telugu

KCR Follows Chandrababu: బాబు బాటలో సీఎం కేసీఆర్

Chandrababu Kcr

Chandrababu Kcr

గతంలో బీజేపీ తో దోస్తానా కట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు  బీజేపీ తో పాటు మొత్తం కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంపై పెద్ద ఎత్తున పోరాడారు. అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ కూడా చంద్రబాబు తరహాలో పోరాటం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను క్షుణంగా పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. మొన్న కేసీఆర్ బీహార్ వెళ్లి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిశారు. ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తోందన్నారు. రాష్ట్రంలో సీబీఐ కేసులు నమోదు చేయడానికి వీలు కల్పించే జనరల్ కన్సెంట్‌ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులందరికీ కేసీఆర్ పిలుపునిచ్చారు.

అయితే సమ్మతి రద్దయితే.. రాష్ట్రంలో కేసు నమోదు చేయాల్సిన ప్రతిసారీ సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమ్మతి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు సమ్మతిని రద్దు చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ దానిని ఉపయోగించుకుంది. అయితే కేసీఆర్ నిర్ణయాన్ని  ప్రతిపక్షాలు ఎలా ఉపయోగించుకుంటాయో చూడాలి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర తొమ్మిది రాష్ట్రాలు సమ్మతిని రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి.

Also Read: YS Jagan : సీఎం జ‌గ‌న్ కు అమెరికా కోర్టు సమ‌న్లు, లోకేష్ దావా