వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna ) గురువారం..అసెంబ్లీలోని కౌన్సిల్ ఛైర్మన్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. తీన్మార్ మల్లన్నతో కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్న ఎమోషనల్ అయ్యారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా పని చేయని తనను పెద్దల సభకు పంపించారని తీన్మార్ మల్లన్న భావోద్వేగానికి గురయ్యారు. తన గెలుపుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో తనకు వచ్చిన మొదటి అవకాశం ఇదే అన్నారు. తన గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించారన్నారు. నిన్నమొన్నటి వరకు ఉన్న మల్లన్న వేరు… ఈరోజు నుంచి బాధ్యత కలిగిన మల్లన్నలా ఉంటానన్నారు.
కాగా గతంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియెజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీకి బైపోల్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమెల్సీ బైపోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగు రాకేశ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్లుగా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్, పాలకూరి అశోక్ సహా 52 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. దీంతో హోరాహోరి పోరులో తీన్మార్ మల్లన్న ఎలిమినేషన్ పద్ధతిలో విజయం సాధించారు.
Read Also : CBN : ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..ఐదు కీలక హామీలపై సంతకాలు