Teenmar Mallanna : కాంగ్రెస్ గూటికి తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna : తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ గూటికి చేరారు.

Published By: HashtagU Telugu Desk
Teenmar Mallanna

Teenmar Mallanna

Teenmar Mallanna : తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ గూటికి చేరారు. పలువురు కాంగ్రెస్ కీలక నేతల సమక్షంలో ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రజా సమస్యలపై బలంగా వాణిని వినిపించే మల్లన్న చేరిక హస్తం పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ల  కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో.. ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పెద్దలు మల్లన్నను కోరినట్లు తెలుస్తోంది.పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన అవకాశాన్ని కల్పిస్తామని మల్లన్నకు హామీ ఇచ్చినట్లు సమాచారం. మల్లన్నను ఈ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా వాడుకునే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆల్‌ ఇండియా ఫార్వర్డ్  బ్లాక్ (AIFB) పార్టీ .. నెలక్రితమే మల్లన్నను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. తీన్మార్‌ మల్లన్న సారథ్యంలో ఎన్నికలకు వెళ్తామని వెల్లడించింది. ఇక తీన్మార్ మల్లన్న టీమ్ రంగంలోకి దిగి ప్రచారం చేసుకుంటుందనే టాక్ అంతటా  వినిపించింది. ఈక్రమంలో అనూహ్యంగా తీన్మార్ మల్లన్న తన రాజకీయ భవితవ్యంపై మరోసారి నిర్ణయం మార్చుకొని కాంగ్రెస్‌లో చేరడం(Teenmar Mallanna)  గమనార్హం.

Also Read: Gold- Silver: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ధరలు..!

  Last Updated: 08 Nov 2023, 07:54 AM IST