Site icon HashtagU Telugu

Teenmar Mallanna : తన ఆస్తినంతా ప్రభుత్వానికి రాసిచ్చిన తీన్మార్ మల్లన్న

Mallanna Property

Mallanna Property

ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక (Warangal – Khammam – Nalgonda BY MLC Elections)కు గాను కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న (Teenmar Mallanna) ఈరోజు తన నామినేషన్ ను దాఖలు చేసారు. 2021 లో ఇదే స్థానం నుండి బిఆర్ఎస్ (BRS) తరుపున పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) విజయం సాధించారు. అప్పుడు స్వల్ప ఓట్ల తేడాతో మల్లన్న ఓటమి చెందారు. ఎమ్మెల్సీ స్థానం 2027 మార్చి వరకు ఉన్నప్పటికీ పల్లా రాజేశ్వర్..గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరుపున జనగాం ఎమ్మెల్యే గా నిల్చుని విజయం సాధించారు. ఆ తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. దీంతో ఈ స్థానానికి గాను ఎన్నికలు అనివార్యమయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో మల్లన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను, తన కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికి బాండ్ రూపంలో రాసిచ్చి సంచలనానికి తెరలేపారు. తనకున్న రూ.1.50కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడితే తన పేరిట, కుటుంబం పేరు మీదున్న ఆస్తులను మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చి, రాజకీయాల్లోకి వస్తానని గతంలో ప్రకటించారు. నేడు (మే 3న) ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే సమయంలో తమ కుటుంబం మొత్తం ఆస్తులను బాండ్ పేపర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి తాను మాట మీద నిలబడే వ్యక్తి అని నిరూపించుకున్నాడు. తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి అప్పగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్న తీన్మార్ మల్లన్న.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టైమ్ ఇస్తే పత్రాలు సమర్పిస్తానని తెలిపారు. ఇక నామినేషన్ సందర్బంగా శుక్రవారం నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ తో మల్లన్న బయలుదేరి నామినేషన్ దాఖలు చేసారు.

Read Also : Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉరుములతో కూడిన వర్షాలు