Site icon HashtagU Telugu

Teenmar Mallanna : కాంగ్రెస్​కు ప్రజలు దేవుళ్లు అయితే కేసీఆర్​కు బానిసలు – తీన్మార్ మల్లన్న

Mallanna Ktr

Mallanna Ktr

కాంగ్రెస్​కు ప్రజలు దేవుళ్లు అయితే కేసీఆర్​ కుటుంబానికి మాత్రం బానిసలు అని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. తెలంగాణలో లోక్​సభ ఎన్నికల పోరు ముగియగా, ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు.

దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచార సమయం ముగింపుకు చేరుకోవడం తో అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న..గత కొద్దీ రోజులుగా వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈరోజు హన్మకొండలో ఏర్పటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్​కు ప్రజలంటే బానిసలు లెక్క కనిపిస్తారు. కానీ కాంగ్రెస్​ పార్టీకి ప్రజలంటే దేవుళ్లు, ఓటర్లు, మహరాజులు లెక్క కనిపిస్తారు. వాళ్లకు మాకు ఉన్న తేడా అది. ఇప్పుడు ఉపఎన్నికలు ఎందుకు వచ్చాయి. బీఆర్​ఎస్​ పార్టీ మాకు ఈ పదవి వద్దని చెప్పినందుకు వచ్చింది. మాకు పట్టభద్రులు అవసరం లేదంటే వచ్చింది. కేటీఆర్​ ఏమంటారు వాళ్ల అభ్యర్థి పిట్స్​ పిలానీలో చదివాడు అంట వాళ్ల అభ్యర్థి. నేను జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నాను అంట. కేసీఆర్​ ఇళ్లంతా దొంగలముఠానే. మీ అందరికీ చర్లపల్లి జైలునే దిక్కు అవుతుంది. అహంకారంతో తనను విమర్శిస్తూ ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ విద్యార్థులను అవమానించిన కేటీఆర్​కు ఓటు ద్వారా పట్టభద్రులు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్​ఎస్​ పని అయిపోయిందని ఎవ్వరూ వారి వెంట ఉండే ప్రసక్తి లేదని చెప్పారు. ఎన్నికల ఫలితాల తరవాత కేసీఆర్​తో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. కేటీఆర్​ పట్టభద్రులను ఓటు అడగడం కాదు కదా వరంగల్​ నగరంలోకి అడుగు ఎలా పెడతారో చూస్తానంటూ హెచ్చరించారు.

Read Also : MLC By Poll : రెండు రోజులు వైన్ షాప్స్ బంద్