కాంగ్రెస్ పార్టీలో MLC తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) అంశం తలనొప్పిగా మారింది. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ ఉండడంతో మల్లన్నకు పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు పంపింది. ఈ నోటీసుల పై తనదైన శైలిలో మల్లన్న స్పందించారు. ఇప్పటివరకు తనకు నోటీసులు రాలేదని, వచ్చినా తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. తాను ఎవరిముందూ మోకరిల్లబోనని, ఈ నోటీసుల వ్యవహారం బీసీలను టార్గెట్ చేసే విధంగా మారిందని విమర్శించారు.
Repo Rate: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. తగ్గనున్న లోన్ ఈఎంఐలు!
తాను చేసిన వ్యాఖ్యలు తన పోరాటం ప్రజల కోసమేనని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తెలంగాణలో బీసీల హక్కులను కాపాడేందుకు తాను కట్టుబడి ఉన్నానని, నిజాయితీగా వ్యవహరించే నాయకులకు నోటీసులు పంపడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించినందుకు నోటీసులు పంపించడమేనా? అని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. అలాగే కులగణన అంశంపై కూడా మల్లన్న తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కులగణన విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యానికి గురైందని, దీనిపై జానారెడ్డి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడం వల్ల బీసీలు నష్టపోతున్నారని మల్లన్న విమర్శించారు. ఈ విషయంలో తాను వెనుకడుగేయబోనని, ఏ చర్యలు తీసుకున్నా సమర్ధంగా ఎదుర్కొంటానని తేల్చిచెప్పారు.
Arrest Warrant Against Sonu Sood: సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ కేసులో చిక్కుకున్నాడు?
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. పార్టీ ఆదేశాలను లెక్కచేయకుండా మల్లన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి పెరిగింది. అయితే, ఆయన తన అభిప్రాయాల్లో మార్పు చేసుకోకపోతే, కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మరింత కఠినమైన చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, తీన్మార్ మల్లన్న భవిష్యత్తులో కాంగ్రెస్‌లో కొనసాగుతారా? లేక కొత్త మార్గాన్ని ఎంచుకుంటారా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.