తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Telangana Assembly Elections 2023) వచ్చేసింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నవంబర్ 30న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇక డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో 50-50 ఆడేందుకు అన్ని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నో షాకింగ్ న్యూస్ లు, మరెన్నో సంచలనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ కు సూటిపెట్టే తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ మద్దతుతో మేడ్చల్ బరిలో నిలబడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే ఫలించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా సీఎం అభ్యర్థిగా ఓ పార్టీ ప్రకటించి షాక్ ఇచ్చింది. అదే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. సోమవారం మల్లన్న ఈ పార్టీ పెద్దలను కలిశారు. మేడ్చల్ తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ పార్టీ మల్లన్నను తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది.
తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna )..ఈయన్ను రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తలు ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Elections )స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆయన కూడా ఏమాత్రం నిరాశకు గురికాకుండా 2019లో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు.
2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత ఆయనపై పలు కేసులు నమోదు కావడం తో జైలుకు సైతం వెళ్ళివచ్చాడు. ఆ తర్వాత 2021న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ (BJP) లో చేరాడు. కానీ ఆ పార్టీ లో కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనీ భావిస్తున్నాడు. ముందు నుండి కూడా మల్లన్న..మేడ్చల్ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తూ వస్తున్నారు. అయితే అది ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. అయితే.. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని కొన్ని రోజులు.. లేదు కాంగ్రెస్ తరపున బరిలో దిగుతారంటూ మరికొన్ని రోజులు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగినా కాంగ్రెస్ (Congress) మద్దతు ఉంటుదని కొన్ని రోజులు ఇలా ఎవరికీ వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు అవేవి కాదు.. మల్లన్న ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ (All India Forward Block Party) తరఫున బరిలోకి దిగుతున్నారని తాజా సమాచారం అందుతుంది. అంతే కాదు తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున సీఎం అభ్యర్థి కూడా తీన్మార్ మల్లన్నే అని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు మల్లన్నతో పార్టీ వర్గాలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మల్లన్న మేడ్చల్ నుండి ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనికి కాంగ్రెస్ మద్దతు సైతం కోరడం .. నేతలతో చర్చలు కూడా జరపడం జరిగింది. అయితే.. కాంగ్రెస్ నుండి ఎలాంటి నిర్ణయం రాకపోవటంతో.. తాజాగా మల్లన్న తో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సంప్రదించారని తెలుస్తుంది. ఏఐఎఫ్‌బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో సమావేశమైన మల్లన్న.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై లోతుగా చర్చించారు. అయితే.. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసేందుకు మల్లన్న బృందానికి పార్టీ వర్గాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వినికిడి. మరి ఈసారైనా మల్లన్న ను ప్రజలు గెలిపిస్తారో లేదో చూడాలి.
Read Also : Telangana : కేసీఆర్ పులి.. మరి కేటీఆర్ సంగతేంటి..?