CM KCR : సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య.. తప్పిన ప్రమాదం

CM KCR : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది.

Published By: HashtagU Telugu Desk
Cm Kcr

Cm Kcr

CM KCR : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు దేవరకద్రలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఉంది. దీనికి హాజరయ్యేందుకు  సీఎం కేసీఆర్ బయలుదేరిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది.  సాంకేతిక సమస్యను వెంటనే గుర్తించి అప్రమత్తమైన పైలట్ మార్గం మధ్య నుంచి.. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్‌ను దారి మళ్లించాడు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం పర్యటన కోసం ఏవియేషన్‌ అధికారులు మరో హెలికాప్టర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. మరో హెలికాప్టర్ రాగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి పర్యటనను యథావిధిగా కొనసాగించనున్నారు.ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు దేవరకద్ర, 1:30 గంటలకు గద్వాల, 2:40 గంటలకు మక్తల్, 4:00 గంటలకు నారాయణపేట  నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలను షెడ్యూల్ చేశారు. హెలికాప్టర్  సమస్యతో ఇవన్నీ కాస్త ఆలస్యంగా జరిగే అవకాశాలు(CM KCR)  ఉన్నాయి.

Also Read: CM Stalin: సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి తాగుబోతు బాంబు బెదిరింపు

  Last Updated: 06 Nov 2023, 01:41 PM IST