జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills Bypoll) టీడీపీ మళ్లీ బరిలోకి దిగేందుకు కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు పార్టీ పెద్దగా చురుకుగా లేకపోయినా, ఈ ఉపఎన్నికను పార్టీ పునరుజ్జీవనానికి అవకాశంగా చూస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, బీజేపీ(BJP)తో పొత్తు కొనసాగితే ఈ సీటును ప్రాధాన్యంగా తీసుకుని బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నందమూరి కుటుంబం నుంచి సుహాసిని (Nandhamuri Suhasini) పేరును ముందుకు తెచ్చారు. ఆమెకు ఉన్న ప్రజాదరణ, కుటుంబ పూర్వ వైభవం, ఎన్టీఆర్ వారసురాలిగా ఉన్న గుర్తింపు పార్టీకి అదనపు బలం చేకూర్చవచ్చని టీడీపీ అంచనా వేస్తోంది.
Rohit Sharma: రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
తెలంగాణ టీడీపీ శ్రేణుల సమాచారం ప్రకారం.. ఈ వ్యూహంపై తుది నిర్ణయం తీసుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబు నేడు ఉండవల్లి నివాసంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ యూనిట్ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఇందులో జూబ్లీహిల్స్ అభ్యర్థిత్వంపై చర్చించడంతో పాటు బీజేపీతో సీటు కేటాయింపుపై వ్యూహరచన జరిగే అవకాశముంది. అదే సమయంలో, చంద్రబాబు బీజేపీ కేంద్ర నాయకులతో కూడా భేటీ అయి సుహాసిని అభ్యర్థిత్వంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరితే, ఇది జాతీయ స్థాయిలో కూడా ఆసక్తికరమైన పొలిటికల్ డెవలప్మెంట్‌గా మారవచ్చు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. సుహాసిని జూబ్లీహిల్స్ నుండి పోటీ చేస్తే అది టీడీపీకి గ్లామర్ ఫ్యాక్టర్‌గా మారవచ్చు. ఆమెకు సినీ నేపథ్యం, కుటుంబ వారసత్వం, అలాగే ప్రజాసేవపై చూపిన ఆసక్తి – ఇవన్నీ కలిసి ఓటర్లలో మంచి ఇంపాక్ట్ కలిగించవచ్చు. మరోవైపు, బీజేపీ–టీడీపీ పొత్తు కుదిరితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కఠిన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఉపఎన్నిక కేవలం ఒక నియోజకవర్గం పరిమితి కాకుండా, రాబోయే తెలంగాణ రాజకీయ సమీకరణాలకు మార్గదర్శకంగా నిలవొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
