Site icon HashtagU Telugu

NTR: నంద‌మూరి ఇంట విషాదం.

Uma

Uma

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి ఇవాళ మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. ఈ ఘటన నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ మధ్యే చిన్న కూతురు వివాహాన్ని ఉమామహేశ్వరి ఘనంగా చేశారు. ఈ వివాహం ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె మరణించడం తీవ్రశోకాన్ని మిగిల్చింది.

ఉమామహేశ్వరి మరణవార్త తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్, ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె మరణ వార్తను విదేశీ టూర్ లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.