Jr NTR: చంద్రబాబు వ్యూహంలో జూనియర్! భలే ట్విస్ట్

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయ ఇరకాటంలో పడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి (NTR Centenary Celebrations) రూపంలో అగ్ని పరీక్షను ఫేస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ తెరపై రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న ఆయన ఈ సారి తప్పించుకోలేని పరిస్థితికి టీడీపీ (TDP) తీసుకొచ్చింది.

  • Written By:
  • Updated On - May 16, 2023 / 12:54 PM IST

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయ ఇరకాటంలో పడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి (NTR Centenary Celebrations) రూపంలో అగ్ని పరీక్షను ఫేస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ తెరపై రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న ఆయన ఈ సారి తప్పించుకోలేని పరిస్థితికి టీడీపీ (TDP) తీసుకొచ్చింది. నందమూరి కుటుంబం మొత్తం నారా కుటుంబానికి అండగా ఉందన్న సంకేతం వెళ్ళడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడలో జూనియర్ పడిపోయారు. ఇప్పటి వరకు జూనియర్ ను దూరంగా పెట్టారు అనే అభిప్రాయం ఆయన అభిమానులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం వాళ్లకు ఇవ్వకుండా శతజయంతి వేడుకలకు ఆహ్వానం పంపారు. టీడీపీ కార్యాలయ కార్యదర్శి, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నిర్వాహకుడుగా వ్యవహరిస్తున్న టీడి జనార్దన్ ఆహ్వాన పత్రికను అందచేశారు. ఈ నెల 20న హైద్రాబాద్ లో జరిగే శతజయంతి వేడుకలకు హాజరుకావాలని కోరారు. దీంతో ఇప్పుడు జూనియర్ హాజరు అవుతారా? లేదా ? అనే ఉత్కంఠ టీడీపీ వర్గాల్లోనూ, జూనియర్ అభిమానుల్లో నెలకొంది.

టీడీపీ మొదటి పిలుపు జూనియర్ కు ఇదే. శతజయంతి, మహానాడులకు జూనియర్ ని ఎక్కడా పిలవలేదు. గత నెల చివరలో విజయవాడ నడిబొడ్డున జరిగిన ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఆహ్వానించారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ కార్యక్రమానికి హాజరైనా జూనియర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ చాలా గొడవ చేశారు. ఈ పరిణామాలతో తెలుగుదేశంలో కలవరం రేగింది. ఇటీవల ఉమ్మడి క్రిష్ణా జిల్లా టూర్ కి చంద్రబాబు వెళ్లినపుడు కూడా జూనియర్ ఫ్యాన్స్ సీఎం జూనియర్ అంటూ గొడవ చేశారు. ప్ల కార్డులు ప్రదర్శించారు. వారిని సభ నుంచి బయటకు పంపించేశారు టీడీపీ నాయకులు. ఇలా పలు రూపాల్లో గ్యాప్ అయితే జూనియర్ తో టీడీపీకి ఉందన్న చర్చ నడుస్తుంది.

దాంతో దాన్ని తొలగించుకోవాలన్న ఉద్దేశ్త్యంతో ఉన్నరా లేక జూనియర్ ని రప్పించుకుని ఈసారి ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలన్న ఎత్తుగడ వేశారా అన్నది తెలియదు కానీ జూనియర్ ఇంటికి వెళ్ళి అన్న గారి శత జయంతి ఉత్సవాల ఇన్విటేషన్ అందించారు.

Also Read: New CM: సిద్ధరామయ్యే కర్ణాటక కొత్త సీఎం?… అధికారిక ప్రకటనే తరువాయి

ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లో జరిగే ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని వేడుకల కమిటీ చైర్మన్ హోదాలో టీడీ జనార్దన్, స్వర్గీయ ఎన్టీయార్ చివరి కుమారుడు నందమూరి రామక్రిష్ణ ఈ ఆహ్వానం అందించారు. ఇక ఇపుడే అసలైన పాయింట్ చర్చకు వస్తోంది. ఈ నెల 20న హైదరాబాద్ లో జరిగే సభకు చంద్రబాబు బాలయ్య కూడా హాజరవుతారు. ముఖ్యంగా చంద్రబాబుతో కలసి వేదిక పంచుకోవడానికి జూనియర్ కి సమ్మతమేనా అనే చర్చ వస్తోంది. తన తాత గారి శత జయంతి అని భావించి జూనియర్ వచ్చినా కూడా బాబు జూనియర్ ఒకే వేదిక మీద కనిపిస్తే చాలు అది రాజకీయ రచ్చగానే అవుతుంది. వారంతా ఒక్క చోట కలిస్తే నారా తో నందమూరి బంధం బిగిసి అది అతి పెద్ద బలగంగా మారుతుంది. అందుకే జూనియర్ రాక మీదనే అందరి కళ్ళూ ఉన్నాయి. జూనియర్ తీసుకునే నిర్ణయం ఏపీ రాజకీయాలను తెలుగుదేశం రాజకీయాలను మలుపు తిప్పనుంది. మరో వైపు జూనియర్ ని ఖమ్మం రావాలని బీఆర్ఎస్ మంత్రులు ఇన్వైట్ చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు పిలిచారు. ఈ నెల 28న అంటే అన్న గారి శత జయంతి వేళ ఖమ్మంలో విగ్రహావిష్కరణ ఉంటుంది. దానికి కచ్చితంగా జూనియర్ హాజరవుతారని అంటున్నారు. అది ఫిక్స్డ్ ప్రోగ్రాంగా సమాచారం ఉంది.

ఒక రోజు ముందు నుంచి అంటే ఈ నెల 27, 28 తేదీలలో ఎన్టీయార్ శత జయంతి వేడుకలు రాజమండ్రీలో మహానాడులో కూడా జరుగుతాయి. హైదరాబాద్ లో జరిగే శత జయంతి ఉత్సవాలకు పిలిచిన తరహాలోనే జూనియర్ ని మహానాడుకు పిలుస్తారా లేదా ఇవన్నీ డౌట్లుగానే ఉన్నాయి. ఏది ఏమైనా మొత్తానికి చిన్న ఎన్టీవోడిని రాజకీయ పద్మవ్యూహంలోకి చంద్రబాబు సరైన సమయంలో నెట్టారు.

Also Read: Draft Clear & Simple Law : చట్టాన్ని చక్కగా రూపొందిస్తే.. కోర్టుల జోక్యానికి నో ఛాన్స్ : అమిత్ షా

తెలుగుదేశం వర్గాలు ఇపుడు జూనియర్ ని హైదరాబాద్ లో కార్యక్రమానికి జూనియర్ కనుక హాజరైతే మహానాడుకు కూడా ఆయన్ని పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే బంతి ఇపుడు జూనియర్ కోర్టులో ఉంది. ఆయన బాబుతో కలుస్తారా. తెలుగుదేశం రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నారా? అనేది ఈ నెల 20తో తేలనుంది. అదే రోజు జూనియర్ బర్త్ డే కూడా. ఆ రోజున కీలకమైన నిర్ణయం తీసుకుంటారా అన్నదే చూడాల్సి ఉంది. టీడీపీ ఆహ్వానం పలికితే జూనియర్ హాజరయ్యేవారని ఇప్పటి వరకు ఆయన అభిమానులు చెబుతూ వస్తున్నారు. తెలంగాణాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో ఎన్టీయార్ 56 అడుగుల ఎత్తులో శ్రీక్రిష్ణుడి గెటప్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణకు పిలిస్తే ఒకె చెప్పారు జూనియర్. శత జయంతి వేడుకలను నందమూరి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ ముఖ్యులు కలసి అట్టహాసంగా ఏడాది పొడవునా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఏ వేడుకలోనూ ఎక్కడా జూనియర్ కనిపించలేదు. ఇప్పుడు ట్విస్ట్ జూనియర్ మీద పడింది. దానికి ఆయన ఇచ్చే రిప్లై ఏమిటో చూడాలి.