Site icon HashtagU Telugu

KCR-Chandrababu: కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ, త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష!

Kcr And Chandra Babu

Kcr And Chandra Babu

KCR-Chandrababu: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడి, తుంటి ఎముకకు ట్రీట్ మెంట్ తీసుకొని హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు క్యూ కడుతున్నారు ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించి కోలుకోవాలని ఆకాక్షించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ కేసీఆర్ ను పరామర్శించారు.

కెసిఆర్ తో మాట్లాడాలనిపించి వచ్చానని, ఆయన కొలుకోవడానికి 6 వారాల సమయం పడుతుంది డాక్టర్లు చెప్పారని ఆయన అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజా సేవకు రావాలని, త్వరలోనే మాములుగా నడుస్తారని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు వెంట పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.

ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించారు. ఇవాళ మ‌ధ్యాహ్నం సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి న‌ర్సింహులు కూడా పరామర్శించారు.

Also Read: Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తాం: మంత్రి ఉత్తమ్ కీలక నిర్ణయం