Site icon HashtagU Telugu

Babu Wishes To Seetakka: సీతక్కకు బాబు బర్త్ డే విషెస్!

Chandrababu

Chandrababu

ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు సీతక్క జన్మదినం ఇవాళ. ఒకవైపు ఎమ్మెల్యేగా తన పనులు నిర్వహిస్తూ ప్రజాసేవ లో సైతం ముందుంటారు. కరోనా పాండమిక్ సమయంలో సీతక్క ఎంతోమంది ఆదివాసీ బిడ్డలకు అండగా నిలిచింది. వాళ్లకు కావాల్సిన కనీస సదుపాయాలు సమకూర్చి తన మానవత్వాన్ని చాటుకుంది. శనివారం ఆమె బర్త్ డే ను పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. సీతక్క కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో మంచి అనుబంధం ఉంది. సీతక్కను చంద్రబాబు తన సోదరిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో సీతక్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారాయన.

‘‘ప్రజాసేవకు అసలైన నిర్వచనం చెబుతూ, బడుగు బలహీన వర్గాల బంధువుగా పిలువబడుతున్న ములుగు ఎమ్మెల్యే, సోదరి Danasari Seethakka కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నా‘‘ అంటూ ఆశీర్వదించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా విషెస్ చెప్పారు. ‘‘తెలంగాణ మహిళా నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే Danasari Seethakka గారికి జన్మదిన శుభాకాంక్షలు. గిరిజనుల, ఆదివాసీల, పేదల బాధలు తీర్చడానికి అహర్నిశలు శ్రమించే మీ సేవాగుణం స్ఫూర్తిదాయకం. ప్రజలే సర్వస్వంగా భావించే మీరు నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.