TTDP: పూర్వ వైభ‌వానికి `జ్ఞానేశ్వ‌ర్` మెరుపులు

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభ‌వం వెనుక‌బ‌డిన వ‌ర్గాల ద్వారానే వ‌స్తుంద‌ని మ‌రోసారి ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు న‌మ్మారు.

  • Written By:
  • Updated On - November 9, 2022 / 05:09 PM IST

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభ‌వం వెనుక‌బ‌డిన వ‌ర్గాల ద్వారానే వ‌స్తుంద‌ని మ‌రోసారి ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు న‌మ్మారు. అందుకే, బీసీ నాయ‌కునిగా ప్రఖ్యాతిగాంచిన కాసాని జ్ఞానేశ్వ‌ర్ కు టీడీపీ తెలంగాణ ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థిగా బీసీ నాయ‌కుడు ఆర్ కృష్ణ‌య్య‌ను (యాద‌వ సామాజిక‌వ‌ర్గం) ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత ఆయ‌న పార్టీని ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయారు. దీంతో వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన టీడీపీ లీడ‌ర్ ఎల్ ర‌మ‌ణ‌(ప‌ద్మ‌శాలి)కు తెలంగాణ టీడీపీ ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. కానీ, ఆయ‌న పార్టీని విజ‌య‌ప‌థాన న‌డిపించ‌లేక టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆయ‌న స్థానంలో బ‌క్క‌ని న‌ర‌సింహులు(ఎస్సీ)కు టీడీపీ అధ్యక్ష ప‌ద‌విని అప్ప‌గించారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కు అనుచ‌రునిగా ఉన్న బ‌క్క‌ని సీనియార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన‌ప్ప‌టికీ అనుకున్న ఫ‌లితాల‌ను సాధించ‌లేక‌పోయారు.

ప్ర‌స్తుతం కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌( బీసీ) కు టీడీపీ తెలంగాణ ప‌గ్గాల‌ను అప్ప‌గిస్తూ చంద్ర‌బాబు నాయుడు కీల‌క నిర్ణ‌యం తీసున్నారు. ఆయ‌న టీడీపీకి పూర్వ వైభ‌వాన్ని తీసుకొస్తార‌ని క్యాడ‌ర్ న‌మ్ముతుంది. వెనుక‌బ‌డిన వ‌ర్గాల నాయ‌కునిగా రాజ‌కీయాల్లోకి కొన్ని ద‌శాబ్దాల క్రితం ప్ర‌వేశించిన ఆయ‌నకు మంచిపేరుంది. పేదరికం నుంచి పైకొచ్చిన `కాసాని` పేద బీసీల‌కు అప‌ద్భాంద‌వునిగా క‌నిపిస్తుంటారు. అందుకే, చంద్ర‌బాబు టీడీపీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

 

Also Read:  PM Modi Tour: `మోడీ`కి మోదం, ఖేదం!
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, శాసనమండలి సభ్యుడిగా పని చేశాడు. ప్రస్తుతం తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 2001–2006 రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ప‌నిచేశారు. 2007–2011 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడుగా కొన‌సాగారు. ప్రస్తుతం మన పార్టీ అధ్యక్షుడుగా ఉంటూ ఆ పార్టీని టీడీపీలో విలీనం చేశారు. 1975–1987 ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ప‌నిచేశారు. 1987–1993 రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, 1993 రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, 1999ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు, 2005లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పని చేశారు.

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. హైదరాబాద్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కాసాని జ్ఞానేశ్వర్ 2022 అక్టోబర్ 14న తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా 2022 నవంబర్ 04న నియమితుడయ్యాడు. గురువారం నాడు అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించ‌బోతున్నారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు భారీ ఏర్పాట్ల‌ను చేయ‌డాన్ని గ‌మ‌నిస్తే, రాబోవు రోజుల్లో టీడీపీకి పూర్వ వైభ‌వం కోసం చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం విజ‌య‌వంతం కాబోతుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read:  Kasani Gnaneshwar: తెలంగాణలో తెలుగుదేశాన్ని బలమైన శక్తిగా తీర్చిదిద్దుతా: కాసాని జ్ఞానేశ్వర్‌!