TDP- CBN :ఎన్నిక‌ల‌ రోడ్ మ్యాప్,ఎన్టీఆర్ ట్ర‌స్ట్ లో సంద‌డి

హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్(TDP-CBN) మ‌ళ్లీ క‌ళ‌గా క‌నిపిస్తోంది.

  • Written By:
  • Updated On - March 28, 2023 / 04:30 PM IST

హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్(TDP-CBN) మ‌ళ్లీ క‌ళ‌గా క‌నిపిస్తోంది. చాలా కాలం త‌రువాత ట్ర‌స్ట్ భ‌వ‌న్లో(Hyderabad) పొలిట్ బ్యూరో స‌మావేశం జ‌రిగింది. తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. వ‌చ్చే మ‌హానాడును రాజ‌మండ్రిలో నిర్వ‌హించాల‌ని పొలిట్ బ్యూరో ప్రాథ‌మికంగా నిర్ణ‌యించింది. స‌మ‌కాలీన ప‌రిణామాలు, ఏపీ, తెలంగాణాల్లో టీడీపీ బ‌లోపేతంపై చ‌ర్చ జ‌రిగింది. ఈనెల 29న జ‌రిగే పార్టీ ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా ప్ర‌తిపాద‌న‌ల‌పై కూడా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ మ‌ళ్లీ క‌ళ‌(TDP-CBN)

పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని నాంప‌ల్లి గ్రౌండ్స్ లో(Hyderabad) టీడీపీ నిర్వ‌హిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ విభాగాల అధిప‌తులు, ప్ర‌జాప్ర‌తినిధులకు మాత్ర‌మే ఆహ్వానం పంపారు. డెలిగేట్స్ స‌మావేశం జ‌రుపుకునేందుకు నాంప‌ల్లి గ్రౌండ్స్ ను ముస్తాబు చేశారు. ప‌లు దేశాల నుంచి డెలిగేట్స్ హాజ‌రుకానున్నారు. ముందు రోజు పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ లో(TDP-CBN) నిర్వ‌హించ‌డం తెలంగాణ విభాగానికి నూత‌నోత్సాహాన్ని ఇచ్చింది.

కింగ్ మేక‌ర్ గా తెలంగాణ టీడీపీ(TDP-CBN)

రాబోవు రోజుల్లో కింగ్ మేక‌ర్ గా తెలంగాణ టీడీపీ(TDP-CBN) కావాల‌ని భావిస్తోంది. అందుకోసం పార్టీని వీడి వెళ్లిన వాళ్ల‌కు ఆహ్వానాల‌ను పంపుతోంది. ఆ జాబితాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న్ను పార్టీలోకి ఇటీవల తెలంగాణ చీఫ్ కాసాని ఆహ్వానించారు. అంతేకాదు, మిగిలిన పార్టీల్లోని బీసీ నాయ‌కుల‌ను కాసాని ట‌చ్ చేస్తున్నారు. రాబోవు రోజుల్లో బీజేపీతో పొత్తు అంశం మీద కూడా పొలిట్ బ్యూరోలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి పార్టీని(Hyderabad) బ‌లోపేతం చేయ‌డానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌కు పూనుకుంది.

నాలుగు చోట్ల బ‌హిరంగ స‌భ‌లు

ఇటీవ‌ల ఖ‌మ్మం స‌భ సూప‌ర్ హిట్ అయింది. ఆ త‌ర‌హాలో నాలుగు చోట్ల బ‌హిరంగ స‌భ‌లు పెట్టాల‌ని టీడీపీ యోచిస్తోంది. హైద‌రాబాద్(Hyderabad) కేంద్రంగా స‌భ‌ను నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. సెంట్ర‌ల్‌, ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బ‌లంగా ఉన్న టీడీపీ పొత్తు లేకుండా ప్ర‌ధాన పార్టీలు నెగ్గే ప‌రిస్థితి లేదు. ప్ర‌స్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏక‌తాటిపైకి రావ‌డం బీజేపీకి మైన‌స్ గా మారింది. ఆ క్ర‌మంలో బీజేపీకి గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లలో గెలుచుకోవాలంటే ఖ‌చ్చితంగా టీడీపీ పొత్తు (TDP-CBN)అవ‌స‌రం. అందుకే, టీడీపీ బ‌లం ఏమిటో చూపాల‌ని ముందుగా చంద్రబాబు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఏపీలోనూ పొత్తుల అంశంపై ప్రాథ‌మికంగా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. వీలున్నంత వ‌ర‌కు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా చూడాల‌ని భావిస్తున్నారు. అందుకోసం కొన్ని త్యాగాల‌కు సిద్దంకావాల‌ని టీడీపీ అనుకోవ‌డ‌లేదు. క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను మాత్ర‌మే క‌లుపుకుని పోవాల‌ని భావిస్తోంది.

ఇరు రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే

ఇరు రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో టీడీపీ తెలంగాణ బీజేపీకి లాభించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. కానీ, ఏపీలో బీజేపీతో పొత్తు కార‌ణంగా టీడీపీకి న‌ష్టం వాటిల్లుతుంద‌ని కొన్ని స‌ర్వేల సారాంశం. ఇక జ‌న‌సేన‌తో పొత్తు కూడా టీడీపీకి లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌గా ఉంటుంద‌ని రాజ‌కీయ మేధావుల అభిప్రాయం. ఎందుకంటే, తాత్కాలికంగా కొంత మేలు జ‌రిగిన‌ప్ప‌టికీ జ‌న‌సేన కార‌ణంగా దీర్ఘ‌కాలంలో టీడీపీకి న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం లేక‌పోలేదు. అందుకే, ఒంట‌రి పోరుకు ఏపీలో వెళ్లాల‌ని టీడీపీ భావిస్తోంది. అయితే, ఆ రాష్ట్రంలోని ప‌రిస్థితుల దృష్ట్యా క‌మ్యూనిస్ట్ లను క‌లుపుకుని పోతే బాగుంటుంద‌న్న అభిప్రాయం కూడా ఉంది. ఇలా ప‌లు అంశాల‌ను చూచాయ‌గా పొలిట్ బ్యూరోలో (Hyderabad)చ‌ర్చించుకున్నారు మిన‌హా ఎక్క‌డా నిర్ణ‌యాలు, తీర్మానాలు చేయ‌లేదు.

Also Read : YCP-CBN : జ‌గ‌న్ `స్వ‌ర‌`ల‌హ‌రి, టీడీపీ బ‌హుప‌రాక్‌!

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్సావాల ముగింపు స‌భ‌ను మ‌హానాడు ఘ‌నంగా నిర్వ‌హింబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను ఇప్ప‌టి నుంచే చేయ‌డం ద్వారా రాజ‌కీయంగా. ల‌బ్దిపొందాల‌ను చూస్తున్నారు. రాజ‌మండ్రి కేంద్రంగా జ‌రిగే మ‌హానాడు ఉత్సాహంతో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బ్లూ ప్రింట్ సిద్ద‌మ‌యింది. ఇప్ప‌టికే యువ‌గ‌ళం యాత్ర కొన‌సాగుతోంది. యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటుంది. ప్ర‌త్యేకించి తెలంగాణ టీడీపీ విభాగం(TDP-CBN) కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డానికి ముందుకొస్తోంది. రాష్ట్ర‌, జిల్లా, మండ‌ల క‌మిటీల‌తో పాటు అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఇంచార్జిల‌ను కూడా త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌డానికి క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. మొత్తంగా ఇరు రాష్ట్రాల లీడ‌ర్ల‌తో హైద‌రాబాద్ (Hyderabad) లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ మునుప‌టి మాదిరిగా చాలా ఏళ్ల త‌రువాత మంగ‌ళ‌వారం క‌ళ‌క‌ళ‌లాడింది.

Also Read : CBN Target:తెలంగాణ ఎన్నిక‌లకు`నాంప‌ల్లి గ్రౌండ్స్`లో మ‌లుపు