Telangana : గాంధీభ‌వ‌న్‌లో టీడీపీ జెండాల‌తో సంబ‌రాల్లో పాల్గొన్న తెలుగు తముళ్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య‌దుందుభి మోగించింది. కాంగ్రెస్ విజ‌యోత్స‌వాల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 08:54 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య‌దుందుభి మోగించింది. కాంగ్రెస్ విజ‌యోత్స‌వాల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌లో టీడీపీ జెండాల‌తో కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేశారు. రేవంత్ రెడ్డి పాట‌ల‌కు స్టెప్పులేస్తూ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి విజ‌యోత్స‌వాల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ పోటీ నుంచి త‌ప్పుకుంది. అయితే టీడీపీ అధినేత మాత్రం ఎవ‌రికి మ‌ద్దుతు ఇవ్వాల‌నే దానిపై క్లారిటీ ఇవ్వ‌క‌పోయిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం టీడీపీ క్యాడ‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది. ప్ర‌ధానంగా టీడీపీ బ‌లంగా ఉన్న ఖ‌మ్మం, నిజ‌మాబాద్, రంగారెడ్డి జిల్లాలో టీడీపీ క్యాడ‌ర్ కాంగ్రెస్ క్యాడ‌ర్‌తో క‌లిసి ప‌నిచేసింది. కాంగ్రెస్ గెలుపుకోసం టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, సోష‌ల్ మీడియా ప‌ని చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 65 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. చాలా చోట్ల కాంగ్రెస్ అభ్య‌ర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజ‌యం సాధించింది. సిద్ధిపేట‌లో గ‌తంలో కంటే ఈ సారి హ‌రీష్‌రావుకు మెజార్టీ త‌గ్గింది. ఇటు కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్ రెడ్డి ఇద్ద‌రు ఓట‌మి చెందారు. బీజేపీ అభ్య‌ర్థి అక్క‌డ విజ‌యం సాధించారు.

Also Read:  Revanth Reddy Swearing Ceremony : రేపు రాజ్ భవన్ లో తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం