TTDP: టీడీపీ వైపు 1983 బ్యాచ్‌, బీసీల‌కు కాసాని గాలం!  

రాజ‌కీయ తెర‌మీద‌కు చాలా మంది లీడ‌ర్ల‌ను తెలుగుదేశం పార్టీ ప‌రిచ‌యం చేసింది. ఏ మాత్రం రాజ‌కీయ నేప‌థ్యంలేని వాళ్ల‌ను స్వ‌ర్గీయ ఎన్టీఆర్ 1983 ఎన్నిక‌ల్లో గెలిపించారు. అందుకే, వాళ్లు ఏ పార్టీకి వెళ్లిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ ను ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. ఆ కోవ‌లోకి వ‌చ్చే లీడ‌ర్ల‌లో మంత్రి య‌ర్ర‌బెల్లి ద‌యాక‌ర్, క‌డియం శ్రీహ‌రి, మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు, ఉమామాధ‌వ‌రెడ్డి కుటుంబం, స‌క్కినేని వెంక‌టేశ్వ‌ర‌రావు, పెద్దిరెడ్డి ..ఇలా చెప్పుకుంటూ పోటే తెలంగాణ‌లోనే లీడ‌ర్ల జాబితా చాంత‌డంత ఉంది.

  • Written By:
  • Updated On - November 14, 2022 / 12:25 PM IST

రాజ‌కీయ తెర‌మీద‌కు చాలా మంది లీడ‌ర్ల‌ను తెలుగుదేశం పార్టీ ప‌రిచ‌యం చేసింది. ఏ మాత్రం రాజ‌కీయ నేప‌థ్యంలేని వాళ్ల‌ను స్వ‌ర్గీయ ఎన్టీఆర్ 1983 ఎన్నిక‌ల్లో గెలిపించారు. అందుకే, వాళ్లు ఏ పార్టీకి వెళ్లిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ ను ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. ఆ కోవ‌లోకి వ‌చ్చే లీడ‌ర్ల‌లో మంత్రి య‌ర్ర‌బెల్లి ద‌యాక‌ర్, క‌డియం శ్రీహ‌రి, మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు, ఉమామాధ‌వ‌రెడ్డి కుటుంబం, స‌క్కినేని వెంక‌టేశ్వ‌ర‌రావు, పెద్దిరెడ్డి ..ఇలా చెప్పుకుంటూ పోటే తెలంగాణ‌లోనే లీడ‌ర్ల జాబితా చాంత‌డంత ఉంది.

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జీవితాన్ని గుర్తు చేసుకుంటోన్న కొంద‌రు సీనియ‌ర్లు మ‌ళ్లీ ఆ పార్టీని తెలంగాణ‌లో బ‌తికించాల‌ని యోచిస్తున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న తొలి త‌రం టీడీపీ లీడ‌ర్లు( సీనియ‌ర్లు) తిరిగి టీడీపీ గూటికి చేర‌డానికి సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది టీడీపీ పూర్వ‌పు లీడ‌ర్లు ఉన్నారు. వాళ్ల‌లో స‌గానికి పైగా అసంతృప్తిగా ఉన్నారని స‌మాచారం. వాళ్లంద‌రూ తెలుగుదేశం పార్టీని బ‌తికించుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ అడుగులు వేయ‌గానే టీడీపీ గూటికి వాళ్లు రావ‌డానికి ముహూర్తం పెట్టుకున్నార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

Also Read:  KCR Early Polls?: కేసీఆర్ ‘ముందస్తు’ సమర౦.. వామపక్షాలతో పొత్తుకు సిద్ధం!

ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ బీ టీమ్ గా టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ పార్టీలోని లీడ‌ర్లు, క్యాడ‌ర్ 90శాతం పూర్వపు టీడీపీతో నిండి ఉంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అంటే ప్రాణం ఇచ్చే కేసీఆర్ తెలుగుదేశం పార్టీని నామ‌రూపాల్లేకుండా చేశారు. తెలుగుదేశంలోని పూర్వ‌పు ప‌రిచ‌యాల‌తో ఆ పార్టీని బ‌ల‌హీన‌ప‌రిచారు. ప్ర‌స్తుతం మారిన ప‌రిణామాల దృష్ట్యా కేసీఆర్ ను వీడి పూర్వ‌పు టీడీపీ లీడ‌ర్లు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పెట్టిన పార్టీని బ‌తికించుకోవాల‌ని ముందడుగు వేస్తున్నార‌ని టాక్‌.

వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను ఆద‌రించిన పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. ఆ పార్టీ బ‌ల‌హీన ప‌డిన త‌రువాత బీసీల‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. పైగా ఒకానొక సంద‌ర్భంగా ఏబీసీడీ గాళ్ల వ‌ల్ల ఏమ‌వుతుంద‌ని ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో వ్యాఖ్య‌నించిన అంశాన్ని బీసీల్లోని కొంద‌రు లీడ‌ర్లు గుర్తు చేసుకుంటున్నారు. ద‌ళితుల‌ను సీఎం చేస్తాన‌ని మోసం చేసిన కేసీఆర్ బీసీల‌కు అన్యాయం చేస్తున్నార‌ని ఆ వ‌ర్గంలోని భావ‌న‌. అంతేకాదు, కేవ‌లం క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ ప్ర‌భుత్వంగా ఉంద‌ని కొంద‌రు లోలోన మండిపడుతున్నారు. వాళ్లంద‌రూ ఇప్పుడు ప్ర‌త్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని ఎంచుకోవ‌డానికి సిద్దం అయ్యార‌ని తెలుస్తోంది.

Also Read:  Telangana DGP: ‘డీజీపీ’ పోస్టుపై ఉత్కంఠత.. రేసులో ఆనంద్, అంజనీ కుమార్!

వివిధ బీసీ వ‌ర్గాల లీడ‌ర్ల‌తో ప్ర‌స్తుతం టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ కు బ‌ల‌మైన సంబంధాలు ఉన్నాయి. బీసీ ఉప వ‌ర్గాల‌తో స‌హా అంద‌రూ కాసాని మీద న‌మ్మ‌కంగా ఉంటారు. ఆ ప‌రిచ‌యాల‌తో వివిధ పార్టీల్లోని బీసీ నాయ‌కుల‌ను టీడీపీ వైపు ఆక‌ర్షించ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎంత వ‌ర‌కు ఆయ‌న చేస్తోన్న ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందో చూడాలి.