Site icon HashtagU Telugu

Jagga Reddy: స్టైలిష్ లుక్ లో జగ్గారెడ్డి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

Jaggareddy

Jaggareddy

రాజకీయ నాయకులు అనగానే ఖద్దరు, వైట్ అండ్ వైట్ డ్రస్సులు గుర్తుకువస్తాయి. ప్రతి నాయకుడి ఏదో ఒక స్టైల్ ను ఫాలో అవుతుంటారు. కొందరు కుర్తాలు ధరిస్తే, మరికొందరు వైట్ అండ్ వైడ్ లో డ్రస్సుల్లో దర్శనమిస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని చూస్తే ఖద్దరు వేస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాజువల్ డ్రెస్ తో సింపుల్ గా ఉంటాడు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గా రెడ్డి పొడవాటి గడ్డం, జుట్టుతో గంభీరంగా ఉంటాడు.

అతను ఎప్పుడూ సాదాసీదా డ్రెస్‌లనే వేసుకోవడానికి మాత్రమే ఇష్టపడతాడు. చాలా ఏళ్లుగా అదే ఫాలో అవుతున్నాడు. తాజాగా ఆయన కొత్త లుక్స్ తో చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. గడ్డం, జుట్టు తీసేసి కార్పోరేట్ లుక్ లో సూట్స్ లో కనిపించాడు. తాజాగా ఎమ్మెల్యేకు సంబంధించిన క్లిక్‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జగ్గారెడ్డి ఓ షోరూంను సందర్శించినప్పుడు కొత్త లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు. ఈ ఫొటోలు చూసిన కాంగ్రెస్ అభిమానులు జగ్గారెడ్డి అసలు వయస్సు కంటే తక్కువ వయస్సులో కనిపిస్తున్నారని అంటున్నారు.