Revanth Reddy: ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్.. ప్రత్యేక కార్యాచరణలో రేవంత్!

తెలంగాణా కాంగ్రెస్ కు పూర్వవైభవం రానుందా.. అందుకు టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి కొత్త కార్యాచరణ రూపొందించారా.. అంటే కాంగ్రెస్ వర్గాల

  • Written By:
  • Updated On - November 19, 2022 / 01:34 PM IST

తెలంగాణా కాంగ్రెస్ కు పూర్వవైభవం రానుందా.. అందుకు టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి కొత్త కార్యాచరణ రూపొందించారా.. అంటే కాంగ్రెస్ వర్గాల నుండి అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కేంద్రంలో బీజేపి సర్కార్ల అవినీతి, ప్రజాకంఠక పాలన నుండి ప్రజలను విముక్తి కావించేందుకు జాతీయ కాంగ్రెస్ ప్రజలనాడి పట్టేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే కార్యచరణ సిద్దం చేసుకున్న టిపిసిసి అందుకు అధిష్టానం అనుమతి కోసం వేచిచూస్తుంది.

రాష్ట్రంలో పేద మద్య తరగతి ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూసేందుకు కాంగ్రెస్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఈడీ, సీబీఐ, రాష్ట్ర జీఎస్టీ దాడులు, ఆరోపణలు, ఎమ్మెల్యేల చుట్టూ దండయాత్రతోనే కాలయాపన చేస్తుండడంతో, ప్రజా సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ కార్యాచరణ రూపొందించుకుంటుంది. శనివారం దీనికి సంబందించి కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ జరిగనుంది. ప్రధానంగా రైతు సమస్యలతోపాటు ఓబీసీ సమస్యలు, నోటిఫికేషన్లు, మహిళా సమస్యలపై చర్చించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటామని టిపిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ తిరిగి పూర్వ వైభవానికి సిద్దమవుతున్నట్లు పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుంది.

ప్రధానంగా వరంగల్ రైతు డిక్లరేషన్ విజయం తర్వాత, రాహుల్ గాంధి భారత్ జోడో జోష్ తో క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా బలం పుంజుకుంటున్న కాంగ్రెస్ కు శనివారం జరగబోయే సమావేశం కొత్త కార్యచరణను ఇవ్వనుంది. రైతులు, బీసీలు, ఓబీసీలు, మహిళలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై క్షేత్రస్థాయిలో పోరాటాలు, ఉద్యమాలతో అధికార ప్రభుత్వానికి చెమటలు పట్టించేందుకు సమావేశం కీలకం కాబోతుంది. ఈ సమావేశంలో కార్యాచరణ అనంతరం మొదటిగా రైతుల సమస్యలపై పోరాటం చేస్తూనే డిసెంబర్ 7న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల నుండి వెనుకబడిన తరగతులు, బడుగు, బలహీన వర్గాల పక్షాన కదం తొక్కేందుకు కాంగ్రెస్ సిద్దమవుతుంది. అదేవిదంగా అధిష్టానం అనుమతితో రాష్ట్రంలో పాదయాత్రతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తుంది.