Revanth Campaign: కాంగ్రెస్ ను మోసం చేసినోడు రాజకీయంగా చావడం ఖాయం!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

Published By: HashtagU Telugu Desk
revanth reddy arrest

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి గెలిపించాలని కోరుతూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఆడబిడ్డను గెలిపించండి, అభివ్రుద్ధిని చేయనివ్వండి అనే నినాదంతో మునుగోడు ఓటర్లను ఆకట్టుకున్నారు. మునుగోడు ప్రచారంలో ఆయన మాట్లాడుతూ 2014 నుంచి 2018 వరకు టీఆరెస్ ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, రాష్ట్రంలో బీజేపీ ఒక్క మహిళకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు రేవంత్ మండిపడ్డారు.

ఆడవాళ్లకు టికెట్ ఇస్తే అరిష్టం అనుకునే పార్టీలు టీఆరెస్, బీజేపీ లు అని, నలుగురు మహిళలకు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో అయిదుగురు మహిళలను మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, ఈ ఉప ఎన్నికలు మునుగొడుకు ఏమైనా నిధులు వచ్చాయా? ఇతర పార్టీలను ప్రశ్నించారు.

అమ్ముడు పోయినోళ్ళకు మాత్రమే నిధులు వచ్చినయ్, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని పైసలతో టీఆరెస్, బీజేపీ కొనాలని చూస్తున్నాయని, తేలు మంత్రం తెలియనోడు పాము నోట్లో వేలుపెట్టినట్లు ఉందని పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు  చేశారు.

కాంగ్రెస్ ను మోసం చేసి పోయినోడు రాజకీయంగా చావడం ఖాయమని, మునుగోడులో మీ ఆడబిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఓటర్లను అభ్యర్థించారు. పాల్వాయి స్రవంతి సీఎం చొక్కా పట్టి మరీ మునుగోడు సమస్యలపై కొట్లాడుతుంది అని అన్నారు. రాష్ట్రమంతా మునుగోడు వైపు చూస్తోంది అని, మీ తీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందని నమ్ముతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.

  Last Updated: 09 Oct 2022, 07:32 PM IST