Rahul Meet @ Sircilla: కేటీఆర్ ఇలాకాలో రాహుల్ సభ!

జాతీయ సమావేశాలతో తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటింది.

  • Written By:
  • Updated On - July 6, 2022 / 01:08 PM IST

జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటింది. అధికార పార్టీ టీఆర్ఎస్ తో సై అంటూ మాస్టర్ ప్లాన్ మొదలుపెట్టింది. ఢిల్లీ వేదికగా రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభతో దూకుడుమీదున్న కమలం త్వరలో అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టనుంది. బైక్ ర్యాలీలు, సభలు సమావేశాలు నిర్వహించేలా స్కెచ్ వేసింది. అయితే బీజేపీకి ధీటుగా టీకాంగ్రెస్ కూడా తన అద్రుష్టాన్ని పరీక్షించబోతోంది. ఇప్పటికే వరంగల్ లో రాహుల్ సభ తో సత్తా చాటిన కాంగ్రెస్ తాజాగా మరో రెండు సభలను నిర్వహించబోతోన్నట్టు తెలుస్తోంది. బీజేపీకి ధీటుగా బహిరంగ సభలు నిర్వహించి అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీకి క్షేత్రస్థాయిలో చెక్ పెట్టాలని భావిస్తోంది. ఢిల్లీలో రాహుల్‌ గాంధీని కలిసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఈ రెండు సభల్లో పాల్గొనాల్సిందిగా కోరగా.. ఆయన అంగీకరించారు. సెప్టెంబరు, నవంబరులలో ఈ సభలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సిరిసిల్ల, ఖమ్మంలలో బహిరంగ సభలు

టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకు వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ సిరిసిల్లలో అడ్డాను ఎంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందనీ, కేవలం కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నోసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే విషయమై రాహుల్ చేత ఓయూ విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించాలనుకుంది. కానీ ఇటు ప్రభుత్వం, అటు హైకోర్టు అభ్యంతరాలు చెప్పడంతో నిరుద్యోగుల అంశానికి బ్రేక్ పడింది. ఇప్పుడు అదే అంశాన్ని సిరిసిల్ల వేదికగా హైలైట్ చేస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని టీకాంగ్రెస్ భావిస్తోంది.

చేరికలకు ఛాన్స్

కాంగ్రెస్ ఆకర్ష్ పేరుతో చేరికలపై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి ఊహించన విధంగా సక్సెస్ అయ్యారు. ఇప్పటికే పీజేఆర్ కూతురు విజయారెడ్డి, బడంగ్ పేట్ మేయర్ తో సాహ ఇతర టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేవిధంగా వ్యూహరచన చేసి సఫలీక్రుతడయ్యాడు. మున్ముందు మరిన్ని చేరికలు ఉంటాయని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక మాజీ మంత్రి జూపల్లి సైతం టీఆర్ఎస్ తీరుపై అసంత్రుప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోనకర్లేదు. ఇతర పార్టీల నేతలు సైతం కాంగ్రెస్ తీర్థం పచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే చేరికల విషయమై రేవంత్ రెడ్డి గోప్యత పాటిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.