Raja Singh Warns Munawar: స్టాండ్ అప్ కమెడియన్ కు రాజాసింగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో స్టాండ్-అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షోను నిలిపివేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి బెదిరించారు.

Published By: HashtagU Telugu Desk
Rajasingh

Rajasingh

హైదరాబాద్‌లో స్టాండ్-అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షోను నిలిపివేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి బెదిరించారు. నగరంలో షో నిర్వహిస్తే కమెడియన్‌కు తగిన బుద్ధి చెప్తామని ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. జనవరిలో కూడా బీజేపీ నాయకులు బెదిరింపులకు పాల్పడటంతో మునావర్ షో రద్దు చేయాల్సి వచ్చింది. హిందూ దేవుళ్లపై జోకులు వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.

“హైదరాబాద్‌లో కమెడియన్ మునావర్ ఫరూఖీ ప్రదర్శన ఇవ్వనున్నట్టు మాకు సమాచారం అందింది. సరే, హోస్ట్ చేయండి. కానీ మీరు అతనికి ఎక్కడ ఆతిథ్యం ఇస్తారు? ఏ థియేటర్లో? ఏ ప్రదేశం? ఎక్కడ నిర్వహించినా దాన్ని అడ్డుకుని మునావర్ ఫరూకీకి గుణపాఠం చెబుతాం’’ అని రాజా సింగ్ తేల్చి చెప్పారు. “ హిందు దేవుళ్లు (రాముడు, సీత) అవమానించినందుకు సరైన బుద్ధి చెప్పి తీరుతాం. హైదరాబాద్‌, తెలంగాణలో హిందువుల శక్తిని ఆయనకు చూపిస్తాం’’ అని రాజా సింగ్‌ అన్నారు. కాగా హైదరాబాద్‌లో తన షో వివరాలను మునావర్ పోస్ట్ చేశాడు. ఆగస్టు 20న నగరంలో ఓ షో నిర్వహించబోతున్నాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజా సింగ్ బెదిరింపులకు పాల్పడ్డాడు.

 

  Last Updated: 11 Aug 2022, 04:02 PM IST