MLA Tatikonda Rajaiah : సొంత నియోజకవర్గంలో ఏంచేయాలన్న భయపడే పరిస్థితి – తాటికొండ రాజయ్య

నియోజకవర్గం లో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదని, నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయన్నారు

Published By: HashtagU Telugu Desk
BRS MP Candidate Rajaiah

Tatikonda Rajaiah

స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (MLA Tatikonda Rajaiah) మరోసారి కీలక కామెంట్స్ (Key Comments ) చేసారు. సొంత నియోజకవర్గంలో ఏంచేయాలన్న భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. నియోజకవర్గం లో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదని, నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయన్నారు తాటికొండ. నియోజకవర్గంలో డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా, కోలాటమాడాలన్నా భయపడుతున్నారని అన్నారు. ఎందుకు అభద్రత భావంలో ఉన్నారో అర్ధం కావట్లేదన్నారు. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని, స్టేషన్ ఘనపూర్‌కు తానే సుప్రీం అని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈసారి తాటికొండ కు కాకుండా కడియం కు టికెట్ ఇవ్వడంతో తాటికొండ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అప్పటినుంచి తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. సమయం దొరికితే చాలు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి గొడవను క్లియర్ చేసి, మనస్థాపంతో ఉన్న రాజయ్యకు కార్పొరేషన్ పదవీ.. అదే రైతు బంధు సమన్వయ సమితి చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చారు. టికెట్ ఇవ్వకపోవడంతో కార్పొరేషన్ చైర్మన్ పదవీని పార్టీ ఇచ్చింది. అయినప్పటికీ రాజయ్య (Mla Rajaiah) తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. జనగామ వచ్చిన ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

Read Also : PM Kisan Removals : ‘పీఎం కిసాన్’ నుంచి భారీగా లబ్ధిదారుల తొలగింపు.. మీ పేరుందా ?

  Last Updated: 08 Oct 2023, 03:58 PM IST