Site icon HashtagU Telugu

BRS MP Candidate Rajaiah: వరంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థిగా తాటికొండ రాజ‌య్య‌..!

BRS MP Candidate Rajaiah

Tatikonda Rajaiah

BRS MP Candidate Rajaiah: వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని కేసీఆర్ ప్ర‌క‌టించారు. మధ్యాహ్నం తన ఫాంహౌస్‌లో నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తాటికొండ రాజ‌య్య బీఆర్ఎస్ త‌ర‌ఫున ఎంపీ (BRS MP Candidate Rajaiah)గా పోటీచేస్తార‌ని పేర్కొన్నారు. అయితే ముందుగా బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రేసులో హన్మకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ సుధీర్ కూమార్, బాబు మోహ‌న్ ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, అనూహ్యంగా మాజీ సీఎం కేసీఆర్ తాటికొండ రాజయ్య‌కు అవ‌కాశం ఇస్తూ పేరును ప్ర‌క‌టించారు. దీంతో రాజ‌య్య అభిమానులు, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Also Read: PM Modi : త్వరలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు: ప్రధాని మోడీ

అయితే ముందుగా ఈ ఎంపీ టికెట్‌ను ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి కూతురు క‌డియం కావ్య‌కు ఇచ్చిన విష‌యం తెలిసిందే. రాజకీయ కార‌ణాల వ‌ల్ల క‌డియం శ్రీహ‌రి.. ఆయ‌న కుమార్తె సీఎం రేవంత్‌రెడ్డిస‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిన విష‌యం విధిత‌మే. ఇప్పుడు వ‌రంగ‌ల్ కాంగ్రెస్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా క‌డియం కావ్య పోటీ చేస్తున్నారు. దీంతో క‌డియం కావ్య‌, తాటికొండ రాజ‌య్య‌కు ముందు పోటాపోటీ ఉంటుంద‌ని ఇరు పార్టీల నేత‌లు భావిస్తున్నారు.

మ‌రోవైపు బీఆర్ఎస్‌ను ఓడించ‌టానికి సీఎం రేవంత్ నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ ప‌క్కా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇప్ప‌టికే తుక్కుగూడ స‌భ ద్వారా ప్ర‌చారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ త‌మ‌దైన శైలిలో దూసుకుపోతుంది. సీఎం రేవంత్ కూడా స‌భ‌ల్లో పాల్గొని కార్య‌క‌ర్త‌ల‌ను, పార్టీ శ్రేణుల‌ను ఉత్తేజ‌ప‌రుస్తున్నారు. ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఎలాగైనా 14 సీట్లు కాంగ్రెస్ గెలవాల‌ని చూస్తోంది. మ‌రోవైపు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని బీఆర్ఎస్ చూస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇరుపార్టీలు ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేస్తున్నాయి. ఇక‌పోతే మే 13న తెలంగాణ‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. జూన్ 4న ఫ‌లితాలు విడుద‌ల కానున్నారు.

We’re now on WhatsApp : Click to Join

అయితే లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి ఒక స్థానానికి ఉప ఎన్నిక జర‌గ‌నుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక జ‌రగ‌నుంది. అక్క‌డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

Exit mobile version