Site icon HashtagU Telugu

HYD : అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తున్న పబ్ ఫై పోలీసులు దాడి

Ofter9pub

Ofter9pub

హైదరాబాద్ లో పబ్ కల్చర్ గబ్బు లేపుతుంది..వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ (Hyderabad) లోని చాల పబ్స్ (Pub) సందడి సందడిగా మారుతుంటాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు ,ఐటీ ఉద్యోగులు పబ్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే క్రమంలో పలు పబ్స్ వచ్చిన వారిని మరింతగా ఆకట్టుకునేందుకు అశ్లీల డాన్సుల చేయిస్తుంటారు. ఇలాంటి చేయకూడదని , సమయం దాటాక పబ్ క్లోజ్ చేయాలని ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరిస్తున్న వాటిని పట్టించుకోకుండా అలాగే కొనసాగిస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా శనివారం బంజారాహిల్స్ లోని ‘ఆప్టర్ నైన్’ (After 9 Pub) పబ్ ఫై అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడి చేశారు. పబ్‌లో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత పబ్‌ కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్‌కు కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. దాడి చేసిన సమయంలో పబ్‌లో మెుత్తం 160 మంది యువతీ యువకులు ఉండగా.. వారందరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరందరికీ 41A సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించి పంపుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40 యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు వెల్లడించారు.

Read Also : Divya Nagesh : ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ఆ ఐకానిక్ రోల్ చేసింది ఈమె..