Site icon HashtagU Telugu

Tollywood : టాలీవుడ్ లో క‌ల‌క‌లం..నాడు తారా..నేడు శిల్పా!

Tara Shilpa

Tara Shilpa

టాలీవుడ్ లోని ముగ్గురు హీరోలు, ఉన్న‌తాధికారులు, సెల‌బ్రిటీస్ ను శిల్పా చౌద‌రి వ‌ల‌లో వేసుకుంది. విచార‌ణ సంద‌ర్భంగా రాధికా రెడ్డి వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అధిక వడ్డీ వ్యాపారం చేయ‌డం ఒక్క‌టే శిల్ప చేసిందా? రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం లో పెట్టుబడులు పెట్టిందా? అనే కోణం నుంచి పోలీసులు విచార‌ణ చేశారు. కానీ, పూర్తి వివ‌రాల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయారు. పోలీస్ క‌స్ట‌డీ కి మ‌ళ్లీ శిల్ప దంప‌తుల‌ను ఇవ్వాల‌ని కోర్టులో పోలీసులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.
ప్ర‌స్తుతం శిల్ప దంప‌తులు చంచ‌ల్ గూడ్ జైలులో ఉన్నారు. ఆమె ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఇవాళ రాధికారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్య‌వ‌హారంగా ఈ మొత్తం ఉంది. ఇదంతా బ్లాక్ మ‌నీగా ప్రాథ‌మికంగా అర్థం అవుతోంది. భారీ మొత్తంలో శిల్పా చౌద‌రికి ఇచ్చిన ఆ ముగ్గురు హీరోలు ఎవ‌రు అనేది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌ముఖ హీరోలుగా అనుమానిస్తున్న వాళ్ల నుంచి భారీగానే శిల్పా చౌద‌రి తీసుకున్న‌ట్టు అనుమానాలు లేక‌పోలేదు. ఆ దిశ‌గా విచారించిన పోలీసుల‌కు ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

శిల్పా చౌద‌రికి డ‌బ్బులు ఇచ్చిన దివ్యారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం మొత్తం తెర‌మీద‌కు వ‌చ్చింది. మ‌ధ్య‌లో టంగుటూరి రాధికారెడ్డి ఎంట్రీ ఇవ్వ‌డంతో ఈ ఎపిసోడ్ కు కొత్త కోణం ఏర్ప‌డింది. విచార‌ణ సంద‌ర్భంగా ఏడు కోట్లు తిరిగి ఇచ్చేస్తాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.మూడు రోజుల నార్సింగ్ పోలీసు కస్టడీలో ఉన్న శిల్ప పలు విషయాలను పోలీసుల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది.దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డిల‌ నుంచి రూ.7 కోట్లకుపైగా తీసుకుని మోసం చేసినట్టు శిల్పా చౌద‌రిపై ప్రాథ‌మికంగా కేసు న‌మెదు అయిది. 10 కోట్ల‌కు పైగా రాధికారెడ్డికి ఇచ్చాన‌ని శిల్పా చౌద‌రి పోలీసుల వద్ద చెప్పిన‌ట్టు స‌మాచారం. అందుకు సంబంధించిన ఆధారాల‌ను మాత్రం ఇవ్వ‌లేక‌పోయింద‌ని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఖాతాల‌ను చెక్ చేయ‌గా, కేవ‌లం రూ. 16వేలు, ఆమె భ‌ర్త శ్రీనివాస్ ప్ర‌సాద్ అకౌంట్లో రూ. 14వేలు మాత్ర‌మే ఉన్న‌ట్టు గుర్తించారు.అమెరికాలో నివాసం ఉన్న శిల్పా చౌద‌రి హైద‌రాబాద్ కు ఎప్పుడు వ‌చ్చింది? అక్క‌డ ఏమి చేసేది? ఇక్క‌డ ఇప్పుడు ఎలాంటి వాళ్ల‌తో ప‌రిచ‌యాల‌ను క‌లిగి ఉంది? బౌన్స‌ర్ల ర‌క్ష‌ణ‌లో ఉండే శిల్పా చౌద‌రి హోదా ఏంటి? ఎవ‌రి అండ‌తో ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తోంది? రాధికా రెడ్డి, దివ్యారెడ్డి, రేణుకారెడ్డి ఏం చేస్తారు? వీళ్ల‌కు శిల్పా చౌద‌రికి వున్న లింకేంటి? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు పూర్తిగా లేవు. టాలీవుడ్ తో సంబంధం బాగా ఉన్న శిల్ప వ‌ల‌లో చిక్కుకున్న ఆ ముగ్గురు హీరోల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తే, మొత్తం వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్స్ లేక‌పోలేదు. అంతేకాదు, రాధికారెడ్డి, దివ్యారెడ్డి, రేణారెడ్డిల ఆర్థిక ప‌రిస్థితుల‌పై ఆరా తీయాల్సిన అవ‌స‌రం ఉంది.ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు కేవ‌లం శిల్పా చౌద‌రి కోణంలోనే విచార‌ణ జ‌రిపారు. ఇప్పుడు రాధికారెడ్డిని విచారిస్తున్నారు. ఆమె ఇచ్చే వాగ్మూలం కొంత వ‌ర‌కు ప‌నికొస్తుంది. మిగిలిన ఇద్ద‌ర్ని కూడా విచార‌ణ‌లోకి తీసుకుంటే పూర్తి వివ‌రాల‌ను సేక‌రించ‌డానికి ఛాన్స్ ఉంటుంది.

ఇప్పటికే రెండు సార్లు శిల్పను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. మొదటిసారి పోలీసుల విచారణలో చెప్పిన సమాధానాలనే శిల్ప మళ్లీ చెప్పినట్లు సమాచారం. కిట్టీపార్టీల్లో పరిచయమైన వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయలను పెట్టుబడులుగా మలిచేందుకు కొందరు వ్యాపారులకు ఇచ్చినట్టు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కేసు గందరగోళంగా మారింది.
మొత్తంగా నిందితురాలు శిల్ప పలువురిని మోసం చేసి వసూలు చేసిన కోట్ల రూపాయలు ఎక్కడకు మళ్లించిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని తనను మోసం చేసినట్లు చెప్పిన శిల్ప చెబుతోంది. అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో శిల్ప పనిచేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం ఆమె అమెరికా నుంచి భారత్‌కు వచ్చి మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. రాధికారెడ్డికి రూ.10 కోట్లకుపైగా డబ్బులు ఇచ్చినట్టు శిల్ప చెబుతోన్న వ్య‌వ‌హారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పెద్ద త‌ల‌కాయ‌ల వ్య‌వ‌హారం వీళ్ల వెనుక ఉంటే మ‌రో తారా చౌద‌రి కేసు మాదిరిగా ట‌ర్న్ అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు.