Site icon HashtagU Telugu

Tandoor MLA Security: రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం.. ఆ ఎమ్యెల్యేకి భద్రత పెంపు..!

Mla Pilot Rohit Reddy

Mla Pilot Rohit Reddy

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. రోహిత్‌కు 4+4 గన్‌మెన్‌లను కేటాయిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉంది. అలాగే ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవన్నీ నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రోహిత్ రెడ్డి నిర్ణయాత్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌పై దాడి చేసి బీజేపీకి సన్నిహితులుగా భావిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ భద్రతను ప్రభుత్వం పెంచింది.