Tammineni Veerabhadram Health : విషమంగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) ఆరోగ్య పరిస్థితి (Health ) విషమంగా ఉండడంతో కార్యకర్తలు , రాజకీయనేతలు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఖమ్మం నివాసంలో ఉండగా గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇక తాజాగా తమ్మినేని హెల్త్ అప్ డేట్ వివరాలను వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రానికి వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో తమ్మినేని వీరభద్రం […]

Published By: HashtagU Telugu Desk
Tammineni Veerabhadram Heal

Tammineni Veerabhadram Heal

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) ఆరోగ్య పరిస్థితి (Health ) విషమంగా ఉండడంతో కార్యకర్తలు , రాజకీయనేతలు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఖమ్మం నివాసంలో ఉండగా గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇక తాజాగా తమ్మినేని హెల్త్ అప్ డేట్ వివరాలను వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రానికి వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో తమ్మినేని వీరభద్రం బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రంను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలసుకున్నారు. తమ్మినేని వీరభద్రం లంగ్స్ ఇన్ఫెక్షన్ తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. గతంలో కూడా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు అప్పుడు స్టంట్ వేశారు. తాజాగా, మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో ఆందోళన నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి గ్రామంలో కమలమ్మ, సుబ్బయ్యలకు జన్మించిన తమ్మినేని.. వారిది కమ్యూనిస్టు కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచే పార్టీ భావాలు అలవర్చుకున్న ఆయన ఉద్యమాల వైపు మళ్ళాడు. 1971లో సాధారణ కార్యకర్తగా సిపిఎంలో చేరి, రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎదిగాడు. 1991లో మొదటిసారిగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఆయన ఓటమి చెందాడు. అయితే, 1996లో అదే స్థానం నుండి పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు. కాగా, 2004లో ఆయన ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైయ్యాడు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా 2021 జనవరి 25న మూడోసారి ఎన్నికయ్యాడు.

Read Also : Kiara Advani Lip Lock : భర్తతో ఘాటైన అదరచుంభనం.. ఇంటర్నెట్ షేక్ చేస్తున్న ఈ ఫోటో చూశారా..?

  Last Updated: 17 Jan 2024, 09:02 AM IST