Telangana 2023 Polls : మూడు నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్న సీఎం

సీపీఎం కి అసెంబ్లీ కి వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు. రెండోది.. వామపక్ష పార్టీలను బలపరచండి అని పిలుపునిచ్చారు. ఇక మూడో నినాదం.. బీజేపీ దుర్మార్గ పాలనకు స్వస్తి పలకాలని కోరారు

Published By: HashtagU Telugu Desk
Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ (Congress) తో పొత్తు కోసం ఎదురుచూసిన సీపీఎం (CPM)..కాంగ్రెస్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం తో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు రెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.

  1. కారం పుల్లయ్య (ST) – భద్రాచలం
  2. పిట్టల అర్జున్ (ST) – అశ్వారావుపేట్
  3. తమ్మినేని వీరభద్రం – పాలేరు
  4. పలగుడు భాస్కర్ (SC) – మధిర
  5. భూక్య వీరభద్రం (ST) – వైరా
  6. ఎర్ర శ్రీకాంత్ – ఖమ్మం
  7. మాచర్ల భారతి (SC) – సత్తుపల్లి
  8. జూలకంటి రంగారెడ్డి – మిర్యాలగూడెం
  9. బొజ్జ చిన్న వెంకులు (SC) – నకిరేకల్
  10. కొండమడుగు నర్సింహ – భువనగిరి
  11. మోకు కనకారెడ్డి – జనగాం
  12. పగడాల యాదయ్య – ఇబ్రహీంపట్నం
  13. మల్లిఖార్జున్ – పటాన్‌చెరు
  14. ఎం. దశరథ్ – ముషీరాబాద్

We’re now on WhatsApp. Click to Join.

ఈ 14 మందిని బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా సీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) మాట్లాడుతూ..ఎన్నికల్లో మూడు నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. కమ్యూనిస్టుల వల్లనే.. సమాచార హక్కు.. ఉపాధి హామీ వచ్చిందన్నారు. మొదటిది.. సీపీఎం కి అసెంబ్లీ కి వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు. రెండోది.. వామపక్ష పార్టీలను బలపరచండి అని పిలుపునిచ్చారు. ఇక మూడో నినాదం.. బీజేపీ దుర్మార్గ పాలనకు స్వస్తి పలకాలని కోరారు. బీజేపీ గెలిచే చోట.. ఓడించ గలిగే అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పదలుచుకున్నామన్నారని తెలిపారు. అలాగే జర్నలిస్టులకు మూడు వందల గజాలు స్థలం, 10 వేలు పెన్షన్ ఇస్వామని హామీ ఇచ్చారు.

Read Also : Venkatesh -Mahesh Babu : పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న వెంకీ – మహేష్

  Last Updated: 05 Nov 2023, 02:00 PM IST