Tammineni Veerabhadram : కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీచేసిన తమ్మినేని

పాలేరు ఇవ్వమని కోరారు..ముందు...ఇస్తామన్నారు...తర్వాత కుదరదని చెప్పారు. పాలేరు విషయంలో కూడా రాజీ పడ్డాము. వైరా ఇస్తామన్నారు....మేము ఒప్పుకున్నాము. రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 09:41 PM IST

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడం తో పొత్తు ఫై కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇంటెలిచకపోవడం ఏమి తేల్చకపోవడం ఫై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అల్టిమేటం జారీ చేసారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా వైరా, మిర్యాలగూడ నియోజకవర్గాలను సీపీఎం(CPM)కి కేటాయించని పక్షంలో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పారు.

ఆదివారం నాడు సీపీఎం పార్టీ కార్యాలయంలో తమ్మినేని (Tammineni ) మీడియాతో మాట్లాడుతూ…‘‘ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే ఫోన్ మాకు చేసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడాలి రమ్మని చర్చలకు ఆహ్వానించారు. భద్రాచలం, మిర్యాలగూడెం, పాలేరు, మధిర, ఇబ్రహీంపట్నం స్దానాలు ఇవ్వాలని కోరాం. భద్రాచలం మా సిట్టింగ్ స్థానం ఆ సీటు కోసం పట్టుపట్టవద్దని కోరారు మేము కూడా అంగీకరించాము. పాలేరు ఇవ్వమని కోరారు..ముందు…ఇస్తామన్నారు…తర్వాత కుదరదని చెప్పారు. పాలేరు విషయంలో కూడా రాజీ పడ్డాము. వైరా ఇస్తామన్నారు….మేము ఒప్పుకున్నాము. రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఫోన్ చేసి ఇప్పుడు వైరా కూడా కుదరదు హైదరాబాద్ సిటీలో ఏదో ఒకటి ఇస్తామంటున్నారు. మిర్యాలగూడ (Miryalaguda Constituency)తో పాటు వైరా (Wyra constituency ) ఇస్తే ఇప్పటికైన మేము పొత్తుకు సిద్ధం అవుతాం. ఇంకా మెట్లు దిగిరావాలంటే మా వల్లకాదు అని వీరభద్రం చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ (Congress) పెద్దల వైఖరి భిన్నంగా కనిపించిందని సీపీఎంతో పొత్తుకు ఆసక్తి లేనట్లు స్పష్టమవుతుందని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో రెండింటి విషయంలో తాము రాజీ పడినప్పటికీ చివరికి రెండు కేంద్రాలను కేటాయించడంలోనూ కాంగ్రెస్ విముఖత చూపుతోందన్నారు. మాకు బలం ఉన్న ప్రాంతాల్లో పోటీకి అవకాశం కోరుతుంటే హైదరాబాద్ లో ఓ సీటు ఇస్తామని చెప్పడం సరైనది కాదని తమ్మినేని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తాము ఆశిస్తున్నామని అయితే తమతో పొత్తుకు ఆసక్తి లేనట్లుగా తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. రెండు రోజుల్లో సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ లోపు వైరా, మిర్యాలగూడ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇస్తే కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని, లేని పక్షంలో అనివార్యంగా ఒంటరి పోరాటానికి వెళ్లడం తప్ప మాకు మరో మార్గం లేదని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

Read Also : Vizianagaram : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం