Site icon HashtagU Telugu

HYDRA : N కన్వెన్షన్ కూల్చివేత ఫై తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

Tammareddy N Convention Dem

Tammareddy N Convention Dem

హైదరాబాద్ (Hyderabad) లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA ) ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తుండడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా ఇలానే దూకుడుగా ముందుకెళ్లి పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఆయా నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఇలానే ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి చెందిన స్థలాలు, చెరువులను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాగార్జున (Nagarjuna) కు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ (N-Convention Centre) ను హైడ్రా అధికారులు నేలమట్టం చేయడం తో హైడ్రా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కాగా చిత్రసీమ నుండి ఇంతవరకు N-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత గురించి ఎవ్వరు స్పందించలేదు. కానీ దర్శకుడు , నిర్మాత తమ్మారెడ్డి (Tammareddy ) మాత్రం ఫస్ట్ టైం దీని గురించి మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

ఓ ఇంటర్వ్యూలో ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి స్పందిస్తూ.. ఇందులో ఎవరిది తప్పంటారు? అని అడగ్గా.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో చాలా మంది నిర్మాణాలు చేపట్టారని, అలాగే, నాగార్జున కూడా ఎన్ కన్వెన్షన్ నిర్మించారని చెప్పుకొచ్చారు. ఎంత మంది దగ్గర తప్పుడు పర్మిషన్లు ఉన్నాయి? అధికారులను ప్రభావితం చేసి అక్రమంగా పర్మిషన్లు సంపాదించినవారు ఎంతమంది? అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. ఇలా ఏదో రకంగా పర్మిషన్లు సంపాదించి నిర్మాణాలు చేపట్టారన్నట్టుగా మాట్లాడారు. అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల తప్పును ఎత్తిచూపారు.

ఇటీవలే తాను నాగార్జునకు చెందిన ఓ ఇంటర్వ్యూ చూశానని, తనకు ఇష్టం లేకున్నా లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాల్సి వచ్చిందని నాగార్జున్ చెప్పాడని , బహుశా అవి ఈ నిర్మాణం కోసమే ఇచ్చారేమో ఎవరికి తెలుసు? అంటూ తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఇక్కడ అధికారుల అధికార దుర్వినియోగాన్ని ఆయన ప్రశ్నించారు. మాధాపూర్‌లో గతంలో తనకు ఓ సైట్ ఉండేదని, చుట్టుపక్కల ఉన్న అందరికీ పర్మిషన్లు వచ్చాయని, కానీ, తాను పర్మిషన్ కోసం వెళ్లితే అది ఎఫ్‌టీఎల్‌లో ఉన్నదని అనుమతి తిరస్కరించారని గుర్తు చేశారు. ఒక వేళ తాను లంచాలు ఇస్తే పర్మిషన్లు ఇచ్చేవారేమో తనకు తెలియదని, కానీ, తాను అక్రమ మార్గంలో పోదలుచుకోలేదని పేర్కొన్నారు. అప్పుడు ఆఫీసర్లు ఇష్టమొచ్చినట్టుగా నడుచుకున్నారని తెలిపారు. ఇక సీఎం రేవంత్ ఫై తమ్మారెడ్డి ప్రశంసలు కురిపించారు.

Read Also : Dengue Fever : సీజనల్ వ్యాధులపై అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్