Tamilisai : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమిళసై కీలక వ్యాఖ్యలు

కవిత చేసిన నిర్వాకం వల్ల ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి వచ్చిందంటూ తమిళి సై పేర్కొన్నారు

Published By: HashtagU Telugu Desk
Tamilasai Kavitha

Tamilasai Kavitha

తెలంగాణ మాజీ గవర్నర్ , బిజెపి నేత తమిళసై (Tamilisai ) ..కేసీఆర్ (KCR) ఫై అలాగే ఆయన కూతురు కవిత(Kavitha) ఫై కీలక వ్యాఖ్యలు చేసింది. శనివారం మెదక్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఈ రాష్ట్ర గవర్నర్ గా పని చేసిన సమయంలో కేసీఆర్.. కనీస ప్రాధాన్యత ఇవ్వలేదని , గవర్నర్ పదవికి కూడా ఆయన మర్యాద ఇవ్వలేదన్నారు. ఇలాంటి కేసీఆర్ మాటలు నమ్మొద్ధన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కవిత ఏమైనా దేశం కోసం జైలుకు వెళ్లిందా..? ఆమె చేసిన నిర్వాకం వల్ల జైలుకు వెళ్ళిందంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. కవిత చేసిన నిర్వాకం వల్ల ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి వచ్చిందంటూ తమిళి సై పేర్కొన్నారు. ఇప్పుడే కాదు తమిళసై రాష్ట్ర గవర్నర్ గా పని చేసిన సమయంలో పలు సందర్భాల్లో కేసీఆర్ తీరుపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ తనకు ప్రాధాన్యతనివ్వడంలేదని, తాను రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతానికి వెళ్తే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులెవరూ కూడా ప్రొటోకాల్ పాటించడంలేదంటూ పబ్లిక్ గా చెప్పుకొని బాధపడింది.

ప్రస్తుతం ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసి, తమిళనాడులోని సౌత్ చెన్నైయ్ నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఆదేశాల మేరకు ఆమె రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Read Also : KTR Helped Mogilaiah: పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సాయం చేసిన కేటీఆర్

  Last Updated: 05 May 2024, 12:16 PM IST