Site icon HashtagU Telugu

KTR: టాలెంట్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు, అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్

Telangana

Ktr

KTR: పార్క్ హయత్ లో  CMSTEI గిరిజన వ్యవస్థాపకుల సక్సెస్ మీట్ కు మంత్రులు కేటీఆర్ , సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 3వ తేదీ తర్వాత తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. దేవుడు మనిషిని పుట్టించాడు, మనిషి కులాన్ని పుట్టించాడని, ప్రతి మనిషికి సమానమైన తెలివితేటలు ఉంటాయని బలంగా నమ్ముతానని ఆయన అన్నారు. టాలెంట్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు మాత్రమే కాదు, సరైన సమయంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన అన్నారు.

‘‘మనం ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలి… కలల్ని సైతం గొప్పగా కనాలి. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకునే స్ఫూర్తి కలుగుతుంది. సీఎం ఎస్ టి ఈ ప్రోగ్రాం ద్వారా విజయం సాధించిన 500 గిరిజన సోదరులు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలి. గ్రామాలు, గిరిజన తండాల్లో, ఆదివాసీ గుడాలలో ఉన్న యువతరానికి స్ఫూర్తినిచ్చేలా ఈ కార్యక్రమం ఉంది. ఈ ఐదు సంవత్సరాలలో ఈ కార్యక్రమం నడిచిన తీరుపైన అధ్యయనం నిర్వహించి దీన్ని మరింతగా బలోపేతం చేసి, విస్తరించేలా చర్యలు తీసుకోవాలి.

500 మంది ఉన్న ఔత్సాహిక పెట్టుబడిదారుల సంఖ్యను ఐదువేలకు చేరేలా కార్యాచరణ నిర్వహించుకుందాం. గిరిజన సోదరుల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలన్న సూచన పైన సానుకూలంగా ఆలోచిస్తాం. దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే 3I మంత్ర అత్యవసరం… ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్నెస్ ఇదే మంత్రం దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తుంది’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Also Read: Helicopter Ride: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, తిరుమలలో హెలికాప్టర్ రైడ్ సేవలు