Talasani Srinivas Yadav : జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు, తదుపరి కార్యాచరణపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, “ఇది కేవలం పండుగ, కుటుంబ సభ్యుల మధ్య సమావేశం మాత్రమే కాదు. రాజకీయ నాయకులం కాబట్టి పార్టీకి సంబంధించిన పలు అంశాలపైనా చర్చ జరిగింది,” అని తెలిపారు.
Gautam Adani First Business: గౌతమ్ అదానీ తన మొదటి వ్యాపారంలో ఎంత సంపాదించారో తెలుసా?
ఈ భేటీలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం అంశంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. మేయర్‌పై అవిశ్వాసం, బలపరీక్షలపై తదుపరి కార్యాచరణను పార్టీ హైకమాండ్ నిర్ణయించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. తమ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న వార్తలపై చర్చ జరగలేదని తలసాని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ విధానాలపై విపక్షాల తీరును కఠినంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. “ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఆగ్రహం పెరుగుతోంది,” అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా తలసాని, “ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని,” విమర్శించారు. “ప్రజల హక్కులను కాపాడేందుకు, అందరికీ సరైన సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. స్ట్రీట్ వెండర్లకు అన్యాయం జరుగుతుంటే, ప్రజల న్యాయహక్కులను కాపాడటంలో వెనుకడుగు వేయమంటున్నాం,” అని స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత వహించగా, భేటీ సుమారు రెండున్నర గంటల పాటు సాగింది. ఇందులో గ్రేటర్ పరిధిలో పార్టీ బలోపేతం, రాజకీయ వ్యూహాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి నెరవేర్చని హామీలపై విశ్లేషణ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, రైతు రుణమాఫీ, రేషన్ కార్డుల అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని నాయకులు అభిప్రాయపడ్డారు.
కుటుంబ వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చే అంశంపైనా పార్టీ సభ్యుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రాజకీయ వారసత్వం కొనసాగింపులో పార్టీ ముందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ భేటీలో నిర్ణయాలు తీసుకున్నారు.
Vastu Tips: పర్స్ లో నెమలి పించం ఉంచడం మంచిదేనా.. అదృష్టం,ఐశ్వర్యం కలిసి వస్తుందా?