Talasani: చంద్రబాబు నాయుడు అరెస్ట్ బాధాకరం: మంత్రి తలసాని

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఖండించారు.

Published By: HashtagU Telugu Desk
Talasani

Talasani

Talasani: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చాలా బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో మంత్రిగా పని చేసిన తనకు ఈ ఘటన వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసిందని తెలిపారు.

అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరమా ఉందన్నారు. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడి గారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం అన్నారు. సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.

Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ

  Last Updated: 04 Oct 2023, 05:47 PM IST