Congress 6 Guarantees : సాధ్యం కానీ ఆరు గ్యారెంటీలు అంటూ తలసాని సెటైర్లు

కాంగ్రెస్ (Congress) తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీల (Congress 6 Guarantees)పై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas) సెటైర్లు వేశారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని వాటన్నింటినీ నివృతిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అభయహస్తం దరఖాస్తులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగినన్ని […]

Published By: HashtagU Telugu Desk
Talasani Srinivas Yadav sensational comments on Nandi Awards

Talasani Srinivas Yadav sensational comments on Nandi Awards

కాంగ్రెస్ (Congress) తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీల (Congress 6 Guarantees)పై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas) సెటైర్లు వేశారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని వాటన్నింటినీ నివృతిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అభయహస్తం దరఖాస్తులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగినన్ని అందుబాటులో ఉంచాలని తలసాని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా అమలు చేయకుండా కాలయాపన చేయాలని చూస్తున్నదనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని చెప్పారు. హామీలను అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సైతం ఆరు గ్యారెంటీలపై పలు ఆరోపణలు చేసారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని ఆమె అన్నారు. అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు అడగట్లేదని అయోమయంలో ఉన్నారని అన్నారు. బ్యాంక్‌ అకౌంట్‌ మళ్లీ అడుగుతారా? లేదా కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా అనే చర్చ ప్రజల్లో ఉందన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్‌ ఇస్తామని చెప్పారు కాబట్టి.. వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా? వద్దా? అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని గుర్తు చేశారు. ఇదే కాకుండా జనాల్లో ఇంకా చాలా అనుమానా ఉన్నాయని అన్నారు. చాలా ఇండ్లలో మగవాళ్ల పేరు మీదనే గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయని.. అలాంటి వాళ్లకు 500 గ్యాస్‌ సిలిండర్‌ వర్తిస్తుందా? లేదా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారని అన్నారు.

Read Also : Pawan Letter to PM Modi : వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంఫై ప్రధానికి పవన్ కళ్యాణ్ లేఖ..

  Last Updated: 30 Dec 2023, 02:53 PM IST