టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్కిల్ డెవలప్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ జైలు కు పరిమితమైన బాబు కు…ఇప్పుడు పార్టీ నేతలు (TDP Leaders) పార్టీని వీడుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar Resigned ) రాజీనామా చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (2023 Telangana Elections ) పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విషయమై రీసెంట్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కాసాని ములాఖత్ (Kasani Gnaneshwar – Chandrababu Mulakat) అయ్యి చర్చించారు. ఈ చర్చల్లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు కాసానికి సూచించారు. దీంతో కాసాని షాక్ కు గురయ్యారు. ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేయాలనీ పట్టుదలతో ఉండగా..చంద్రబాబు ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచించడం జీర్ణించుకోలేకపోయారు. ఈ తరుణంలో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
గత ఏడాది కాలంగా తెలంగాణలో టీడీపీ క్యాడర్‌ని, నేతల్ని సమన్వయం చేసుకుంటూ వచ్చారు కాసాని జ్ఞానేశ్వర్. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం చెప్పడంతో కాసాని అసంతృప్తికి లోనయ్యారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం పోటీ చేయాలని భావించాయి. అందుకు భిన్నంగా టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.
Read Also : CM KCR: కర్ణాటక లో కరెంటు కోతలపై కేసీఆర్ కామెంట్స్