రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ (Knowledge City Raidurgam) సమీపంలో టీ-స్క్వేర్ (T Square hyderabad) నిర్మాణానికి ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి రాష్ట్ర ప్రజలు , ఐటీ ఉద్యోగులంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు (Chandrababu) హైదరాబాద్ ను ఐటీ హబ్ (IT HUB) గా మార్చిన సంగతి తెలిసిందే. అసలు ఐటీ అంటే తెలియని ఆ సమయంలోనే ఐటీ హబ్ నిర్మించి ప్రపంచ దేశాలను ఆకర్షించాడు. ఐటీ హబ్ ఏర్పాటు తర్వాత ఎన్ని ఐటీ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ , కేటీఆర్ (KTR) లు హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసారు. పదేళ్లలో మాదాపూర్ , కొండాపూర్ , రాయదుర్గం , గచ్చిబౌలి , మణికొండ ఈ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. మనం హైదరాబాద్ లో ఉన్నామా..లేక విదేశాల్లో ఉన్నామా అనే రీతిలో భారీ కట్టడాలు , ఐటీ సంస్థలు ఏర్పడ్డాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ తాజాగా న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ ( York Has Times Square) లాంటి బిల్డింగ్ మాదిరి హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ సమీపంలో.. టీ స్క్వేర్ పేరుతో నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో టీ స్క్వేర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు టీజీఐఐసీ టెండర్లు ఆహ్వానించింది. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా టీ స్క్వేర్ నిర్మాణం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటన తర్వాత చాలామంది కేసీఆర్ మాటలను గుర్తు చేసుకుంటున్నారు.
కేసీఆర్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ ఎన్నోసార్లు ప్రకటించారు. ట్యాంక్ బండ్ చుట్టూ అతి ఎత్తయిన భవనాల నిర్మాణం, లండన్ థేమ్స్ తరహాలో మూసీ నది అభివృద్ధి, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను ప్రకటించారు గానీ అవేవీ పెద్దగా కార్యరూపాన్ని దాల్చలేకపోయాయి. పదేళ్లు సీఎం గా ఉన్నకాని చెప్పనట్లు చేయలేకపోయారు. మరి సీఎం రేవంత్ ఈ టీ స్క్వేర్ నిర్మిస్తారా అని మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది ఇదంతా రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ సర్కార్ ప్రకటన అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం..ఏంజరుగుతుందో అనేది చూడాలి.
Read Also : Red Spinach: ఎర్ర తోటకూర వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?