తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించబోయే డీఎస్సీ ( DSC ) పరీక్షపై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు టి-సాట్ స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్స్ (T-SAT Special Live Programs) ఏర్పాటు చేసినట్లు సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి (CEO Bodanapally Venugopal) శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టులకు నిర్వహించే డీఎస్సీ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష రాసే పద్దతులపై అవగాహన కల్పించేందుకు సబ్జెక్టుల వారికి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
జూలై ఎనిమిదవ తేదీ ఉదయం 11 నుండి 12 గంటల వరకు గంట పాటు నిపుణ ఛానల్ లో అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చే ప్రత్యేక లైవ్ కార్యక్రమాలు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. మొదటి రోజు ఎనిమిదవ తేదీన ఇంగ్లీష్, రెండవ రోజు తొమ్మిదవ తేదీన సైన్స్, 10న మ్యాథ్స్, 11న తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ భాషలపైనా స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్స్ కొనసాగనున్నాయన్నారు. ఇప్పటికే గత ఆరు నెలలుగా 2024 ఫిబ్రవరి నుండి టెట్ మరియు డీయస్సి పై స్పెషల్ లెషన్స్, క్రాష్ కోర్స్ రూపంలో సుమారు 320 గంటల కంటెంట్ ప్రసారం చేశామని వేణుగోపాల్ రెడ్ది గుర్తు చేశారు.
స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పండిట్స్, పీఈటీ, స్పెషల్ క్యాటగిరీ టీచర్లకు ఉపయోగపడే విధంగా ప్రత్యక్ష ప్రసారాలుంటాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య ఛానల్ లో సాయంత్రం ఏడు నుండి ఎనిమిది గంటల వరకు పునః ప్రసారమౌతాయన్నారు.
Read Also : Agniveer : అగ్నివీరుల ఎంపికపై కేంద్రానికి ఆర్మీ కీలక సూచనలు