Site icon HashtagU Telugu

T-SAT: విద్యార్థులకు అండగా టి-సాట్.. రేపటి నుంచి డిజిటల్ లెసన్స్

T-SAT Education:

T-SAT Education:

T-SAT Education: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ డిజిటల్ (Digital Lessons) పాఠ్యాంశాలు ప్రసారం చేసేందుకు… టి-సాట్ (T-SAT) సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీ గురువారం నుండి డిజిటల్ పాఠాలు టి-సాట్ విద్య ఛానల్ లో (T-Sat Channel) ప్రసారం కానున్నాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:05 గంటల వరకు ప్రసారాలు ఇవ్వనుంది టీ-సాట్. ఈ సందర్భంగా సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy) బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ప్రసారాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

తెలంగాణలోని (Telangana) ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు (Students) ఆధునిక సాంకేతికతో కూడిన విద్యను (Study) అందించాలనే ఆలోచనలో భాగంగా… డిజిటల్ పాఠ్యాంశాలు (Digital Classes) ప్రసారం చేస్తున్నట్లు సీఈవో తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్రిడ్జి కోర్స్ లో (Bridge Course) భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆదివారం మినహాయించి తొమ్మిది రోజుల పాటు పాఠ్యాంశ ప్రసారాలుంటాయన్నారు. అరగంట నిడివిగల పాఠ్యాంశాలు ఉదయం పది గంటలకు మూడవ తరగతి విద్యార్థుల నుండి ప్రారంభమై పదవ తరగతి విద్యార్థుల వరకు డిజిటల్ పాఠాలు (Digital Classes) కొనసాగుతాయని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

డిజిటల్ లెసన్స్ మ్యాథ్స్ (Maths), హిందీ (Hindi), ఇంగ్లీష్ (English), సైన్స్ (Science) తో పాటు మిగతా సబ్జెక్టుల్లో రోజుకు మూడు గంటలు తొమ్మిది రోజులు పాటు… 27 గంటలు ప్రసారం అవుతాయన్నారు. మూడు భాషల్లో సిద్ధమైన లెసన్స్ తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలోని సైట్ (స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ) తయారు చేసిన పాఠ్యాంశాల షెడ్యూల్ (Schedule) ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా పాఠశాలలకు చేరిందని గుర్తుచేశారు.

ఆఫ్ లైన్ లో రెగ్యులర్ గా ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలకు అనుబంధంగా ఈ డిజిటల్ పాఠ్యాంశాల ప్రసారాలు కొనసాగనున్నాయని సీఈవో స్పష్టం చేశారు. జులై మొదటి వారంలో పాఠశాల విద్యాశాఖ అందించే రెగ్యులర్ షెడ్యూల్ పాఠ్యాంశాలకు సంబంధించిన వివరాలను అందించనున్నామని, విద్యార్థులు-వారి తల్లిదండ్రులు డిజిటల్ పాఠ్యాంశాల ప్రాధాన్యతను గుర్తించాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు.