Site icon HashtagU Telugu

TPCC : కాంగ్రెస్ శిక్షణా తరగతులు.. రేవంత్ రెడ్డి స్పీచ్ 5 పాయింట్స్

Revanth reddy

నగరంలోని  కోంపల్లి ఆస్పైసియాస్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి.  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 9 మంది ఈ తరగతులకు హాజరయ్యారు. నియోజకవర్గాల వారీగా టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.

  1. కాంగ్రెస్ కార్యకర్తలంతా గల్లీలో కష్టపడితే.. దిల్లీలో మన పార్టీ అధికారంలోకి వస్తుంది. 131 కోట్ల ప్రజల ఆకాంక్షలను తీరుస్తుంది.
  2. మీరు కష్టపడితేనే సోనియమ్మ రాజ్యం వచ్చి తెలంగాణ ప్రజలకు నియంత పాలన నుంచి విముక్తి లభిస్తుంది. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ కార్యక్రమం ద్వారా చర్చిద్దాం.
  3. రాహుల్ గాంధీ నాయకత్వంలో.. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతోంది. 34,706 పోలింగ్ బూత్​లలో ప్రతి బూత్​కు ఓ ఎన్​రోలర్​ ఉంటాడు.
  4. పార్టీలో ఒకరిపై మరొకరు తమ ప్రతాపం చూపించడం కాకుండా.. అందరం కలిసికట్టుగా ఉండాలి. ఆ ప్రతాపాన్ని టీఆర్ఎస్, బీజేపీలపై చూపించాలి.
  5. రాష్ట్రంలో యాసంగి పంటపై ఆందోళన చెందుతున్న రైతులకు అండగా నిలిచి వారికి అన్యాయం జరగకుండా చేద్దామని కార్యకర్తలకు చెప్పారు. ఓవైపు పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తూనే… మరోవైపు ప్రజాసమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. ఆ రెండింటిని సమన్వయం చేస్తూ సోనియమ్మ రాజ్యం వచ్చేలా కృషి చేద్దామన్నారు.