T Congress : రాహుల్‌, ప్రియాంక తో `భ‌ట్టీ` గ్రాఫ్ అప్

జాతీయ పార్టీలకు. (T Congress) ఢిల్లీ ఆధిప‌త్యం త‌ప్ప‌దు. అణిగిమ‌ణిగి ఉండే లీడ‌ర్ల‌ను ప్ర‌మోట్ చేస్తుంటాయి.

  • Written By:
  • Updated On - May 22, 2023 / 04:43 PM IST

జాతీయ పార్టీలకు(T Congress) ఢిల్లీ ఆధిప‌త్యం త‌ప్ప‌దు. అణిగిమ‌ణిగి ఉండే లీడ‌ర్ల‌ను ప్ర‌మోట్ చేస్తుంటాయి. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉండే వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టేస్తుంటారు. అందుకోసం పోటీగా ఒక‌రిద్ద‌ర్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ఆ కోవ‌లోకే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయం వ‌చ్చింద‌ని చెప్పుకోవ‌చ్చు. కాంగ్రెస్ పార్టీలో అంద‌రి కంటే స‌మ‌ర్థుడుగా భావిస్తూ పీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను రేవంత్ రెడ్డికి(Revanth Reddy) అప్ప‌గించింది. ఆ రోజు నుంచి అధిష్టానంను కూడా ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో రేవంత్ రెడ్డి అధిక్ర‌మించుతూ రాజ‌కీయాన్ని న‌డిపారు. వెంట‌నే ఢిల్లీ కాంగ్రెస్ అప్ర‌మ‌త్తం అయింది. ఆయ‌న‌కు క‌త్తెర వేస్తూ వ‌స్తోంది.

స‌మ‌ర్థుడుగా భావిస్తూ పీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను రేవంత్ రెడ్డికి (T Congress)

(T Congress) పీసీసీ అధ్య‌క్షుని హోదాలో రేవంత్ రెడ్డికి(Revanth Reddy) పెద్ద‌గా ప‌వ‌ర్స్ ఏమీ లేవ‌ని చెప్పాలి. కేవ‌లం ఆయ‌న‌తో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వాళ్ల మీద మాత్ర‌మే పెత్త‌నం చెలాయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పూర్వం నుంచి ఉంటున్న వాళ్ల‌ను ఆయ‌న ఆక‌ట్టుకోలేక‌పోతున్నారు. సీనియ‌ర్ల‌ను క‌లుపుకుని పోలేని ప‌రిస్థితిలో ఉన్నారు. పైగా రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని ఒరిజిన‌ల్ కాంగ్రెస్ వాదులు వ్య‌తిరేకిస్తున్నారు. డిక్టేట‌ర్ షిప్ న‌డ‌వ‌ద‌ని ప‌లుమార్లు హెచ్చ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిల‌కు స‌మాచారం లేకుండా రేవంత్ రెడ్డి ప‌లు చోట్ల‌కు వెళ్లారు. సీనియ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఏక‌ప‌క్షంగా ప్రోగ్రామ్స్ ను ప్ర‌క‌టించారు. దీంతో అంద‌రూ ఏక‌మై రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తూ వస్తున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో అధిష్టానంకు ఫిర్యాదులు కూడా చేశారు.

ఏఐసీసీ భ‌ట్టీ విక్ర‌మార్క్ ను ప్రోమోట్

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితిని అధ్య‌య‌నం చేస్తోన్న ఏఐసీపీ ప్ర‌త్యామ్నాయంగా భ‌ట్టీ విక్ర‌మార్క్ ను(Batti Vikramark) ప్రోమోట్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే, పీపుల్స్ మార్చ్ పేరుతో పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 800 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు చేరుకున్న పాద‌యాత్ర జ‌డ్చ‌ర్ల‌కు చేరుకున్న త‌రువాత భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ త‌రువాత ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల్లో బ‌హిరంగ స‌భ‌ల‌ను పెట్ట‌డ‌డం ద్వారా సీఎం అభ్య‌ర్థిగా భ‌ట్టీని ఫోక‌స్ చేయాల‌ని ఢిల్లీ కాంగ్రెస్ వ్యూహంగా ఉంద‌ని తెలుస్తోంది. ఆ స‌భ‌ల‌కు రాహుల్‌, ప్రియాంక వ‌స్తార‌ని స‌మాచారం. అందే జ‌రిగితే, ఇక ద‌ళిత సీఎం తెలంగాణకు(T Congress) ఖాయ‌మ‌ని కాంగ్రెస్ సంకేతాలు పంపిస్తుంద‌ని భావించాలి.

ఏఐసీసీ ప్ర‌మేయం పెరిగింద‌ని క్యాడ‌ర్ కు సంకేతాలు

ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించిన భ‌ట్టీ పాద‌యాత్ర ఖ‌మ్మం వ‌ద్ద ముగ‌య‌నుంది. ఆయ‌న యాత్ర ప్రారంభించేనాటికి పీసీసీ (T Congress) చీఫ్ రేవంత్ రెడ్డి పాద‌యాత్ర చేస్తున్నారు. కానీ, భ‌ట్టీ యాత్ర ప్రారంభ‌మైన త‌రువాత ఆక‌స్మాత్తుగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) యాత్ర‌ను ఆపేశారు. ఇక అక్క‌డి నుంచి ఏఐసీసీ ప్ర‌మేయం పెరిగింద‌ని క్యాడ‌ర్ కు సంకేతాలు వెళ్లాయి. పైగా మంచిర్యాల‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌కు ఢిల్లీ పెద్ద‌లు హాజ‌ర‌య్యారు. పీసీసీ అధ్య‌క్షుని హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ర‌ద్దును ప‌రోక్షంగా వ్య‌తిరేకించారు. అధికారంలోకి వ‌స్తే ఆ పోర్ట‌ల్ ను స‌రిచేస్తామ‌ని మాత్ర‌మే చెప్పారు. మంచిర్యాల వేదిక‌గా జ‌రిగిన స‌భ‌కు జ‌య‌రాం ర‌మేష్‌, ఏఐసీసీ చీఫ్ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. దీంతో రేవంత్ రెడ్డి ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌కు గండిప‌డింద‌ని ఆరోజు నుంచి చ‌ర్చ మొద‌ల‌యింది.

Also Read : T Congress : ఆ న‌లుగురు కాంగ్రెస్లోకి వ‌స్తే..బీజేపీ క్లోజ్

ప్ర‌స్తుతం (T Congress) శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఉన్న భ‌ట్టీ విక్ర‌మార్క్ అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన లీడ‌ర్ గా ఫోక‌స్ అవుతున్నారు. మంచిర్యాల స‌భ‌లోనూ సీనియ‌ర్లు ఆయ‌న‌కు ప‌రోక్షంగా సీఎం అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ధ‌తు పలికారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద సీనియ‌ర్ల‌కు కొంద‌రికి ఉన్న వ్య‌తిరేక‌త భ‌ట్టీకి పాజిటివ్ గా మారింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత అక్క‌డ సిద్ధి రామ‌య్య సీఎం, డిప్యూటీ సీఎంగా శివ‌కుమార్ అయిన‌ట్టుగా తెలంగాణ‌లోనూ సీన్ రిపీట్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కానీ, క‌ర్ణాట‌క‌, తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితులు వేర్వేరుగా ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రియాంక (Priyanka)ఎలాంటి నిర్ణ‌యం ఏఐసీసీ తీసుకుంటుంది? అనేది చూడాలి.

Also Read : Youth Congress War Room: తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటి దొంగలు