T Congress : రేవంత్, రేణుకా చౌద‌రి భేటీ ర‌హ‌స్యం అదే.!

మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌద‌రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌ధ్య జ‌రిగిన భేటీ కాంగ్రెస్( T Congress)

  • Written By:
  • Updated On - April 22, 2023 / 03:40 PM IST

మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌద‌రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌ధ్య జ‌రిగిన భేటీ కాంగ్రెస్( T Congress) వ‌ర్గాల‌ను ఆలోచింప చేస్తోంది. ఎందుకు వాళ్ల‌ద్ద‌రూ ప్ర‌త్యేకంగా భేటీ (Meeting) అయ్యారు. జాతీయ రాజ‌కీయాల గురించా? క‌ర్ణాట‌క ఎన్నిక‌ల గురించినా? తెలంగాణ సీఎం అభ్య‌ర్థిత్వంపైనా, నిరుద్యోగ స‌భ‌ల‌పైనా? అనేది సందిగ్ధం. వాళ్లిద్ద‌రూ అర‌గంట పాటు గురువారంనాడు భేటీ అయ్యారు అనేది మాత్రం వాస్త‌వం.

రేణుకా చౌద‌రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌ధ్య భేటీ( T Congress)

జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో బాగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ రేణుకా చౌద‌రి. అందుకే, ఆమె ఎప్పుడూ జాతీయ స్థాయిలోనే ఆలోచిస్తుంటారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో మోడీని దింప‌డానికి అంద‌రూ క‌లిసి రావాల‌ని ప‌లుమార్లు పిలుపునిచ్చారు. ప్ర‌త్యేకించి చంద్ర‌బాబునాయుడు ఇప్పుడు బ‌య‌ట‌కు రావాల‌ని కూడా ఒకానొక సంద‌ర్భంలో ఆమె అన్నారు. ఏపీ రాజ‌కీయ ప‌రిస్థితులు, అక్క‌డ జ‌రుగుతోన్న అంశాల మీద కూడా రేణుకాచౌద‌రి ప్ర‌స్తావిస్తుంటారు. అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా నిల‌వ‌డానికి అక్క‌డ‌కు వెళ్లారు. ఏపీలోనూ కాంగ్రెస్ బ‌లోపేతం కావాల‌ను ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో గుడివాడ నుంచి పోటీ చేయ‌డానికి సిద్దంగా ఉన్నాన‌ని కూడా సంచ‌ల‌న కామెంట్ ఆ మ‌ధ్య చేశారు. ఇప్పుడు కర్ణాట‌క ఎన్నిక‌ల మీద కూడా ఆమె దృష్టి పెట్టారు. అందుకే, రేవంత్ రెడ్డితో క‌లిసి మంత‌నాలు సాగించారా? (T Congress)అనే టాక్ కూడా ఉంది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపు కోసం చంద్ర‌బాబు మ‌ద్ధ‌తు

రాజ‌కీయాల‌కు అతీతంగా చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి మ‌ధ్య గురుశిష్యుల బంధం ఉంది. బ‌హిరంగంగా వాళ్లిద్ద‌రూ ఒకే వేదిక‌పై క‌నిపించ‌న‌ప్ప‌టికీ తెర వెనుక రాజ‌కీయాల‌ను న‌డ‌ప‌డానికి చేయి క‌లిపే ఛాన్స్ ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్(T Congress)(, టీడీపీ పొత్తు వెనుక కూడా రేవంత్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతుంటాయి. ఆయ‌న్ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ చీఫ్ గా చేయ‌డానికి స‌హ‌కారం చంద్ర‌బాబు అందించార‌ని కాంగ్రెస్ వ‌ర్గాల్లోని టాక్‌. ఇప్పుడు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపు కోసం చంద్ర‌బాబు మ‌ద్ధ‌తు కూడగట్టుకునే ప‌నిలో కాంగ్రెస్ ఉంద‌ని తెలుస్తోంది. ఏపీ, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చరిష్మాను బీజేపీ ఉప‌యోగించుకుంటోంది. ప్ర‌తిగా చంద్ర‌బాబును ప‌రోక్షంగా వాడుకోవాల‌ని కాంగ్రెస్ యోచిస్తుంద‌ని తెలుస్తోంది. అందుకే, రేణుకాచౌద‌రి, రేవంత్ భేటీ (Meeting) అయ్యార‌ని కాంగ్రెస్ లోని కొన్ని వ‌ర్గాల్లోని టాక్‌.

ద‌ళితుల‌కు సీఎం ప‌ద‌వి ఇస్తే భ‌ట్టీకి (T Congress)

ఇక రేణుకాచౌద‌రిని తెలంగాణ రాష్ట్ర నాయ‌కురాలిగా చూసే కాంగ్రెస్ వ‌ర్గాల‌కు(T Congress) మాత్రం వాళ్లిద్ద‌రి భేటీ మ‌రో ర‌కంగా క‌నిపిస్తోంది. రాబోవు రోజుల్లో సీఎం అభ్య‌ర్థిత్వం కోసం రేవంత్ రెడ్డి ఆమె ఆశీస్సుల కోసం వెళ్లార‌ని ప్ర‌చారం ఉంది. ఎందుకంటే, ఆమె వ‌ర్గీయుల‌కు, భ‌ట్టీకి ఖ‌మ్మం వేదిక‌గా ప‌డ‌దు. ఇటీవ‌ల భ‌ట్టీ సీఎం అభ్య‌ర్థిత్వాన్ని బ‌లోపేతం చేస్తూ కోమ‌టిరెడ్డి, ఉత్త‌మ్ అడుగులు వేశారు. మంచిర్యాల స‌భ వేదిక నుంచి వాళ్లు సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు, ఒకానొక ఇంట‌ర్వ్యూలో సీఎం కావ‌డానికి అన్నీ అర్హ‌త‌లు త‌న‌కు ఉన్నాయ‌ని భ‌ట్టి విక్ర‌మార్క్ కూడా చెప్పారు. ప్ర‌స్తుతం శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా కూడా ఆయ‌న ఉన్నారు. ద‌ళితుల‌కు సీఎం ప‌ద‌వి ఇస్తే కాంగ్రెస్ పార్టీ భ‌ట్టీకి ఇస్తుంద‌ని గ‌త వారం రోజులుగా ప్ర‌చారం ఊపందుకుంది. అందుకే, ఆయ‌న‌కు వ్య‌తిరేక గ్రూప్ లీడ‌ర్ గా రేణుకాచౌద‌రిని భావిస్తూ రేవంత్ రెడ్డి భేటీ (Meeting)అయ్యార‌ని కాంగ్రెస్ లోని కొన్ని వ‌ర్గాల అభిప్రాయం.

Also Read : T Congress : వ‌న్ మేన్ షో, నిరుద్యోగ స‌భ‌ల ర‌చ్చ‌!

సీఎం అభ్య‌ర్థిగా భ‌ట్టీ ఫోక‌స్ (T Congress) అవుతున్న స‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ పేరు తెర మీదకు వ‌చ్చింది. ద‌ళితుల‌కు సీఎం అభ్య‌ర్థిత్వం అనే కాన్సెప్ట్ వ‌స్తే భ‌ట్టీకి పోటీగా దామోద‌ర రాజ‌న‌ర్సింహ పేరును ఎలివేట్ చేస్తూ రేవంత్ రెడ్డి కి చెందిన కొన్ని సోష‌ల్ మీడియా సైట్ లు ప్ర‌చారం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంతగా రాజ‌కీయంగా ఫోక‌స్ కావాల‌ని నిరుద్యోగ స‌భ‌ల‌కు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. ఆ క్ర‌మంలో న‌ల్గొండ స‌భ‌ను పెట్టాల‌నుకున్న ఆయ‌న ఆదిలోనే వైఫ‌ల్యం చెందారు. అక్క‌డి కోమ‌టిరెడ్డి, ఉత్త‌మ్ రివ‌ర్స్ కావ‌డంతో స‌భ వాయిదా ప‌డింది. ఖ‌మ్మం నుంచి నిరుద్యోగ స‌భ‌ల‌కు శ్రీకారం చుట్టాల‌ని రేవంత్ భావించారు. అందుకోసం రేణుకాచౌద‌రితో భేటీ అయ్యార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం భ‌ట్టీ పాద‌యాత్ర‌లో ఉన్నారు. ఆయ‌న్ను హైజాక్ చేసేలా నిరుద్యోగ స‌భ ఖ‌మ్మంలో పెట్ట‌డానికి రేవంత్ మాస్ట‌ర్ స్కెచ్ వేశారు. ఆ క్ర‌మంలో రేణుక మ‌ద్ధ‌తు కోసం రేవంత్ భేటీ (Meeting) అయ్యార‌ని చెబుతున్నారు. కానీ, ఆరోజు ఉండ‌డంలేద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. అంటే, నిరుద్యోగ స‌భ కంటే ఏదో అంశం మీద రేవంత్, చౌద‌రి మ‌ధ్య భేటీ జ‌రిగింద‌న్న‌మాట‌.

Also Read : T Congress :రేవంత్ మార్క్ ,ప్రేమ్ సాగ‌ర్ రావుకు ఎస‌రు