T Congress : కాబోయే పీసీసీ జానా?క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌ త‌రువాత.!

తెలంగాణ కాంగ్రెస్ (T Congress) పార్టీలో అనూహ్య ప‌రిణామాలు జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోన్న మాట‌.

  • Written By:
  • Updated On - May 2, 2023 / 03:06 PM IST

తెలంగాణ కాంగ్రెస్ (T Congress) పార్టీలో అనూహ్య ప‌రిణామాలు జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోన్న మాట‌. ఏ ఇద్ద‌రు కాంగ్రెస్ వాదులు క‌లిసినా ఇదే అంశం మీద సీరియ‌స్ చ‌ర్చ జ‌రుగుతోంది. ఏం జ‌రిగే అవ‌కాశం ఉంది? పీసీసీ చీఫ్ ను (PCC Chief) మార్చుతారా? సీఎం అభ్య‌ర్థిని ఎన్నిక‌ల ముందుగానే ప్ర‌క‌టిస్తారా? బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ప్ర‌క‌టిస్తారా? ఇలాంటి సందేహాలు ఎన్నో ఇప్పుడు క్యాడ‌ర్లోనూ మెద‌లుతున్నాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత అనూహ్య మార్పుల‌ను చూడొచ్చ‌ని ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య ప‌రిణామాలు (T Congress) 

క‌ర్ణాట‌క ఫ‌లితాలు సానుకూలంగా వ‌స్తే ఒక విధంగానూ, ప్ర‌తికూలంగా వ‌స్తే మ‌రో విధంగానూ తెలంగాణ కాంగ్రెస్(T Congress) ప‌రిస్థితి ఉండ‌బోతుంది. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌క‌త్వాన్ని మార్చ‌డానికి ఆ పార్టీ సాహ‌సం చేయ‌లేక మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. పీసీసీ చీఫ్ (PCC Chief) రేవంత్ రెడ్డికి ప్ర‌త్యామ్నాయం ఎవ‌రు? అనే పాయింట్ ద‌గ్గ‌ర అధిష్టానం ఆగిపోతుంద‌ని ఆ పార్టీలోని ఢిల్లీ వ‌ర్గాల వినికిడి. కర్ణాట‌క ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా లేక‌పోతే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే ప్ర‌మాదం పొంచి ఉంది. అనూహ్యంగా సీనియ‌ర్లు చాలా మంది బీజేపీ లేదా బీఆర్ఎస్ బాట ప‌డ‌తార‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్ రావు థాక్రే ప‌లు స‌ర్వేల‌ను

ప్లాన్ ఏ, ప్లాన్ బీ ల‌ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం (T Congress) సిద్దం చేసి పెట్టుకుంటోంది. అందులో భాగంగా ప్రియాంక ఈనెల 8 వ తేదీ హైద‌రాబాద్ కు రానున్నారు. సీనియ‌ర్లు, అసంతృప్తివాదుల్లో ఉత్సాహాన్ని నింప‌డం ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకోవడానికి ఆమె స‌భ ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ఆ క్ర‌మంలో నిరుద్యోగ నిర‌స‌న దీక్ష స‌భ‌కు వ‌స్తున్నారు. ఒక వేళ క‌ర్ణాట‌క ఫ‌లితాలు కాంగ్రెస్ కు ప్ర‌తికూలంగా వ‌స్తే, ఒక్క‌సారి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంద‌న్న సంకేతాలు కూడా లేక‌పోలేదు. ఇప్ప‌టికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్ రావు థాక్రే ప‌లు స‌ర్వేల‌ను బేరీజు వేసుకుంటున్నారు. రాబోవు రోజుల్లో ఎన్నిక‌ల‌ను లీడ్ చేయ‌డానికి బ్లూ ప్రింట్ ను ర‌హ‌స్యంగా సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది.

జానా రెడ్డికి  టీ పీసీసీ చీఫ్ ప‌గ్గాలు

అవ‌స‌ర‌మైతే, టీ పీసీసీ చీఫ్(PCC Chief) రేవంత్ రెడ్డి మార్చ‌డానికి కూడా ఢిల్లీ అధిష్టానం సిద్ద‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. అలాంటి ప‌రిస్థితి వ‌స్తే, వివాద‌ర‌హితునిగా ఉన్న జానా రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని భావిస్తుంద‌ట‌. ఉమ్మ‌డి ఏపీలోని కాంగ్రెస్ అనుభ‌వాల‌ను క్రోడీక‌రించుకుని రాబోవు ప‌రిణామాల‌ను అంచ‌నా వేస్తోంది. అప్ప‌ట్లో సీఎంగా ఉన్న వైఎస్ దుర్మ‌ర‌ణం త‌రువాత కాంగ్రెస్ పార్టీ ఒక్క‌సారిగా సంక్షోభంలోకి వెళ్లింది. అధికారంలో ఉన్నంత వ‌ర‌కు ఏదో ఒక ర‌కంగా నెట్టుకొచ్చింది. అధికారం కోల్పోయిన త‌రువాత రెండు రాష్ట్రాల్లోనూ సంక్షోభంలోకి వెళ్ల‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగా అంచ‌నా వేసింది. అదే త‌ర‌హాలో రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయి కాంగ్రెస్ ప‌గ్గాలు అప్ప‌గిస్తే తీవ్ర సంక్షోభం వ‌స్తుంద‌ని ముందుగానే అంచ‌నా వేస్తూ మార్పుల‌కు నాంది ప‌లకాల‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

Also Read : T Congress : రేవంత్, రేణుకా చౌద‌రి భేటీ ర‌హ‌స్యం అదే.!

జాతీయ రాజ‌కీయాల‌కు అనుగుణంగా రాష్ట్ర రాజ‌కీయాలు కూడా మార్పు చెంద‌డం స‌హ‌జం. ఒక వేళ యూపీయేలో భాగ‌స్వామిగా బీఆర్ఎస్ పార్టీ చేరితే, అప్పుడు ప‌రిస్థితులు మ‌రోలా ఉంటాయ‌ని రేవంత్ మాట‌ల ద్వారా అర్థ‌మ‌వుతోంది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే ప‌రిస్థితి వ‌స్తే, కాంగ్రెస్ పార్టీని వీడితానంటూ ఆయ‌న చేసిన కామెంట్ ను ఇప్పుడు అధిష్టానం సీరియ‌స్ గా తీసుకుంది. అంతే కాదు, వ‌చ్చే అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు పీసీసీ చీఫ్ గా (PCC Chief)ఉంటాన‌ని ఇటీవ‌ల ఒక ప్రైవేటు ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంర్వ్యూలో ఆయ‌న ప్ర‌స్తావించారు. అంటే, ప్ర‌స్తుతం అంత‌ర్గ‌తంగా జ‌రుగుతోన్న చ‌ర్చ‌కు తెర వేయ‌డానికి వ్యూహాత్మకంగా రేవంత్ చేసిన కామెంట్ గా సీనియ‌ర్ల‌లోని భావ‌న‌గా ఉంది.

Also Read : Revanth Reddy: సెక్రటేరియట్ కు రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు!

పీసీసీ అధ్య‌క్షుడ్ని(PCC Chief)మార్చాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. సీఎం అభ్య‌ర్థిగా ఫోక‌స్ అవుతోన్న రేవంత్ రెడ్డి దూకుడును క్ర‌మంగా త‌గ్గిస్తోంది. ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోన్న కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడైనా సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అందుకే, సీనియ‌ర్లు కూడా త్వ‌ర‌లో సంచ‌ల‌నాన్ని వింటార‌ని ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో చెప్పుకుంటున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల తరువాత భారీ మార్పులు తెలంగాణ కాంగ్రెస్ లో (T Congress) ఉంటాయ‌ని మాత్రం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో ఆస‌క్తిక‌రం.