T Congress : చంద్రులు టార్గెట్ గా రేవంత్ రెడ్డి! మీడియా మేనేజ్మెంట్ అస్త్రం!

ఎత్తుగ‌డ విష‌యంలో పీసీసీ రేవంత్ రెడ్డి(T Congress) ఆరితేరిన లీడ‌ర్.

  • Written By:
  • Publish Date - January 4, 2023 / 04:18 PM IST

ఎప్పుడు, ఎలాంటి ఎత్తుగ‌డ ఉప‌యోగించాలి. ఏ సంద‌ర్భంలో ప్ర‌యోగించాల‌నే విష‌యంలో పీసీసీ రేవంత్ రెడ్డి(T Congress) ఆరితేరిన లీడ‌ర్. గాంధీ ఐడియాల‌జీ పై జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల మూలానికి వెళ్లారు. టీడీపీ జాతీయ చీఫ్ చంద్ర‌బాబు, బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ జ‌నాద‌ర‌ణ ఉన్న నాయ‌కులు కాద‌ని పీసీసీ(PCC) చీఫ్ రేవంత్ రెడ్డి తేల్చేశారు. ఆయ‌న ఎందుకు ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారు? అనేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లోని హాట్ టాపిక్.

Also Read : Revanth Reddy : పొలిటిక‌ల్ ఐపీఎస్, వైఎస్ త‌ర‌హాలో `ఢిల్లీ` సూర్యుడు!

ప‌దేళ్ల పాటు చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను ద‌గ్గ‌ర నుంచి రేవంత్ రెడ్డి గ‌మ‌నించారు. ఆయ‌న పార్టీ ప‌రంగా కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కాన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు కోట‌రీలో మ‌నిషిగా ఉన్నారు. అదే, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎద‌గ‌డానికి ప్రధాన కార‌ణం అయింది. సీనియ‌ర్ల‌ను కూడా రేవంత్ రెడ్డి(T Congress) కోసం చంద్ర‌బాబు వ‌దులుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా బ‌ల‌మైన రాజ‌కీయ బంధం ఉంద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. అంతటి బంధాన్ని కూడా కాద‌ని ప్ర‌జా క్షేత్రంలో చంద్ర‌బాబుకు ఎప్పుడూ బ‌లంలేద‌ని, కేవ‌లం మీడియాను అడ్డుపెట్టుకుని రాజ‌కీయాలు న‌డిపార‌ని అప‌వాదు వేయ‌డం గ‌మ‌నార్హం.

రేవంత్ రెడ్డి చెప్పే  ఆంత‌ర్యం(T Congress)

తొలి నుంచి ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌కు చంద్ర‌బాబు విలువ ఇస్తుంటారు. ఆ క్ర‌మంలో మీడియాకు ప్రాధాన్యం ఇచ్చారు. కొన్ని మీడియా సంస్థ‌లు ఆయ‌న‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాయి. కానీ, ఆ సంస్థ‌ల కార‌ణంగా ఎప్పుడూ చంద్ర‌బాబు ల‌బ్ది పొంద‌లేదు. పైగా సంస్థ‌లు ఇచ్చిన ఫేక్ స‌ర్వేల కార‌ణంగా 2004, 2009 ఎన్నిక‌ల్లో అధికారాన్ని కోల్పోయారు. ఆ విష‌యం రేవంత్ రెడ్డికి (PCC)తెలియ‌ని విష‌యం కాదు. ఇక మీడియాను అట్టుపెట్టుకుని కేసీఆర్ సీఎం అయ్యారు అనేది రేవంత్ చెప్పే మాట‌. ఉద్య‌మం తొలి రోజుల్లో కేసీఆర్ తో ఉన్న రేవంత్ రెడ్డికి బ‌హుశా మీడియాను ఎలా కేసీఆర్ మేనేజ్ చేశారో, తెలిసి ఉంటుంది. తెలంగాణ వాదాన్ని బ‌లంగా వినిపించే వాళ్ల‌ను మీడియా సంస్థ‌ల్లో కేసీఆర్ నియ‌మించారు. అక్ర‌మ ఆస్తులు క‌లిగిన మీడియా యాజ‌మాన్యాలు ఆయ‌న మాట కాద‌న‌కుండా ఉద్య‌మ‌కారుల‌ను విలేక‌రులుగా నియ‌మించుకున్న మాట వాస్త‌వం. అక్క‌డ నుంచి కేసీఆర్ ఉద్య‌మ‌నాయ‌కునిగా ఎదిగార‌ని రేవంత్ రెడ్డి చెప్పే దానిలోని ఆంత‌ర్యం. అధికారంలోకి వ‌చ్చిన తరువాత సొంత మీడియాను పెట్టుకుని రాజ‌కీయాన్ని కేసీఆర్ న‌డుపుతున్నారు. కానీ, చంద్ర‌బాబు మీడియా మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయ్యార‌ని టీడీపీ భావిస్తోంది.

Also Read : T Congress : రేవంత్ రెడ్డి చాణ‌క్యం! కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ పోరు డైవ‌ర్ట్!

కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా ఉంటే చంద్ర‌బాబు, కేసీఆర్ మాదిరిగా అధికారంలోకి రావ‌చ్చ‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. ఆ విష‌యాన్ని గాంధీ ఐడియాల‌జీ స‌భ‌లో చెప్ప‌డం ఆయ‌న ఎత్తుగ‌డ‌. ఇప్ప‌టికే సొంత సోష‌ల్ మీడియాను బ‌లంగా ఆయ‌న ఉంచుకున్నార‌ని సీనియ‌ర్ల అభిప్రాయం. వాటిని ఆధారంగా చేసుకుని వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌ను పెంచుకుంటూ పార్టీని న‌ష్ట‌ప‌రుస్తున్నాడ‌ని ప‌లు సంద‌ర్భాల్లో సీనియ‌ర్లు చేసిన ఆరోప‌ణ‌. ఇప్పుడు సోష‌ల్ మీడియా, మీడియా కావాల‌ని రేవంత్ రెడ్డి ఎందుకంటున్నారు? అనేది కాంగ్రెస్ వ‌ర్గాల్లోని అంత‌ర్గ‌త టాక్‌. అంతేకాదు, చంద్ర‌బాబు, కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వాళ్ల‌కున్న ప్ర‌జాద‌ర‌ణ‌ను త‌క్కువ‌గా చేసి చూప‌డం రేవంత్ ఎత్తుగ‌డ‌లోని మ‌రో అంశం.

రేవంత్ రెడ్డి స్కెచ్ (pcc)

బీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని జాతీయ వాదాన్ని వినిపిస్తోన్న కేసీఆర్ ను ప‌లుచ‌న చేయ‌డం ద్వారా సెంటిమెంట్ ను అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని రేవంత్ రెడ్డి స్కెచ్ వేసిన‌ట్టు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఖ‌మ్మం స‌భ ద్వారా పూర్వ వైభ‌వానికి దిశానిర్దేశం చేసిన చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డం ద్వారా స‌మీప భ‌విష్య‌త్ లో బీజేపీ, టీడీపీ పొత్తు ద్వారా ప‌డే న‌ష్టాన్ని ముందుగానే పూడ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. కానీ, చంద్ర‌బాబు మ‌ద్ధ‌తు లేకుండా మ‌ల్కాజ్ గిరీ లోక్ స‌భ కూడా రేవంత్ రెడ్డి గెలుచుకునే అవ‌కాశం ఉండేది కాదు. అలాంటి లీడ‌ర్ మ‌ద్ధ‌తును కోల్పోవ‌డానికి సిద్ద‌ప‌డుతున్న రేవంత్ రెడ్డి ఎత్తుగ‌డ ఏంటి? అనే ప్ర‌శ్న వేసుకుంటే బీజేపీకి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌వుతున్నార‌న్న భావ‌నతో ఇప్ప‌టి నుంచే టార్గెట్ చేస్తున్నారు. అంటే, వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ఎదుగుద‌ల కో్సం ఎప్పుడైనా ఎవ‌రినైనా రేవంత్ రెడ్డి ల‌క్ష్యంగా చేసుకోవ‌డానికి వెనుకాడ‌రు. ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కునిగా వ్య‌వ‌రిస్తారు అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.

ఓటుకు నోటు కేసు బుక్ అయ్యే వ‌ర‌కు రేవంత్

పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి రాజ‌కీయ నేప‌థ్యం తీసుకుంటే పెద్ద‌గా క‌నిపించ‌దు. కేవ‌లం 15 ఏళ్ల‌కే పీసీసీ చీఫ్ గా ఎదిగారు. త‌ల‌లు పండిన వాళ్లు సైతం ప‌దవిని అందుకోలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, 50 ప్ల‌స్ వ‌య‌స్సున్న రేవంత్ రెడ్డి కీల‌క ప‌దవికి ఎద‌గ‌డం ఆయ‌న ఎత్తుగ‌డ‌ల్లో భాగం. ఓటుకు నోటు కేసు బుక్ అయ్యే వ‌ర‌కు రేవంత్ గురించి కొడంగ‌ల్ వ‌ర‌కు మాత్ర‌మే పూర్తిగా తెలుసు. ఆ కేసు ఆయ‌న రాజ‌కీయ కెరీర్ కు ట‌ర్నింగ్ పాయింట్‌. ఆయ‌న సెబాస్టియ‌న్ వ‌ద్ద గంట‌ల కొద్దీ అన‌వ‌స‌ర విష‌యాలు మాట్లాడుతూ ఎందుకు ఉన్నారో, ఇప్ప‌టికీ టీడీపీ అధిష్టానంకు అంతుబ‌ట్ట‌దు. కానీ, ఆ కేసులో ఇరుక్కున త‌రువాత రేవంత్ రెడ్డి స్టార్ తిరిగింది. ఆర్థికంగానూ, రాజ‌కీయంగానూ ఒక్క‌సారిగా ఎదిగార‌ని టీడీపీ కీల‌క లీడ‌ర్లు చెప్పుకుంటారు. అప్ప‌టి వ‌ర‌కు అధికార ప్ర‌తినిధిగా మాత్ర‌మే ఉండే ఆయ‌న ఒక్క‌సారిగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాగలిగారు. ఆ త‌రువాత అదే హోదాలో కాంగ్రెస్ పార్టీలో చేరి వ్యూహాత్మ‌కంగా పీసీసీ చీఫ్ అయ్యారు. ప‌దునైన ఎత్తుగ‌డ‌ల‌తో రేవంత్ రాబోవు రోజుల్లో సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు నాంది ప‌ల‌క‌నున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : T Congress: టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీనియర్లు దూరం..!