Site icon HashtagU Telugu

T Congress New Strategy : తెలంగాణ కాంగ్రెస్ కు `సెంథిల్` బూస్ట‌ప్! ష‌ర్మిల హైలెట్ !

T Congress New Strategy

T Congress New Strategy

T Congress New Strategy :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల‌ను కాంగ్రెస్ వార్ రూమ్ ఇంచార్జి శ‌శికాంత్ సెంథిల్ కొనుగొన్నారు. ఇక వాటిని ఏ విధంగా ఉప‌యోగించాలి? అనేదానిపై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. మారుమూల గ్రామాల్లోనూ 50 నుంచి 100 మందికి త‌గ్గ‌కుండా కాంగ్రెస్ కు కార్య‌క‌ర్త‌లు ఉండ‌డం కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతి పెద్ద అసెట్ గా భావిస్తున్నారు. అయితే, లీడ‌ర్ల‌కు, క్యాడ‌ర్ మ‌ధ్య అంత‌రం ఉంద‌ని గ‌మ‌నించార‌ట‌. ఇప్పుడు ఆ గ్యాప్ ను భ‌ర్తీ చేయ‌డం ద్వారా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశ‌గా తీసుకెళ్ల‌డానికి స్కెచ్ వేస్తున్నారు.

త్వ‌ర‌లోనే బ‌స్సు యాత్ర‌కు రూప‌క‌ల్ప‌న (T Congress New Strategy)

ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ ఇంచార్జిగా శ‌శికాంత్ సెంథిల్ ప‌నిచేస్తున్నారు. ఆయ‌న ఇచ్చిన ప్రాథ‌మిక నివేదిక ప్ర‌కారం పార్టీ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను నేరుగా ప్రియాంక‌, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కు అప్ప‌గించారు. ఆ మేర‌కు ఏఐసీపీ శ‌నివారం సంకేతాలు ఇచ్చేసింది. ఇక త్వ‌ర‌లోనే బ‌స్సు యాత్ర‌కు రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంది. సీనియ‌ర్ల‌తో కూడిన బ‌స్సు తెలంగాణ‌లోని మారుమూల ప్రాంతాల‌కు కూడా వెళ్ల‌నుంది. కేవ‌లం నాలుగు నెల‌లు మాత్ర‌మే చాల‌ని, ఆప‌రేష‌న్ విక్ట‌రీ స‌క్సెస్ కావ‌డానికి వంద‌శాతం తెలంగాణ‌లో ( T Congress New Strategy) అవ‌కాశం ఉంద‌ని సెంథిల్ ఇచ్చిన నివేదిక‌. దాని ప్ర‌కారం ష‌ర్మిల‌ను కూడా క‌లుపుకుని తెలంగాణ కాంగ్రెస్ ముందుకు క‌ద‌ల‌నుందని తెలుస్తోంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఎవ‌రు ఈ సెంథిల్ ?

తమిళనాడుకు చెందిన సెంథిల్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. NRCకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో సెంథిల్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 నుంచి సర్విద్య సంఘానికి బాధ్యత వహిస్తున్నాడు. సెంథిల్ వ్యూహాలు అమలు చేయడంలో ఆయ‌న దిట్ట. కర్నాటక ఎన్నికలకు వార్ రూమ్ ఇంచార్జ్ గా పనిచేసిన సెంథిల్ 40శాతం కమిషన్ సర్కార్ నినాదానికి ఆద్యుడు. ప్రభుత్వ వైపల్యాలు గ్రౌండ్ లెవల్కు ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేయడంలో సెంథిల్ మాస్టర్ మైండ్. నాయకుల మధ్య సమన్వయం పెంచడంలో సిద్ధహస్తుడు. కర్నాటకలో 8 నెలల్లో గ్రౌండ్ లెవల్ కు రీచ్ అయ్యామని, తెలంగాణలో  ( T Congress New Strategy) కేవలం నాలుగు నెలల సమయం ఉన్నా సరిపోతుందని సెంథిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాజ‌కీయాల‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ వార్ రూం ఇంచార్జీగా తన కోర్ కమిటీలో మెంబర్ గా ఉన్న శశికాంత్ సెంతిల్ ని నియమించ‌డం గ‌మ‌నార్హం. పలు అంశాలపై పార్టీ ముఖ్య నేతలకు సెంథిల్ పాఠాలు చెప్తుంటాడు. పార్టీ క్యాడర్ క్లాసుల్లో సిలబస్ కూడా ఆయనే ప్రిపేర్ చేస్తున్నాడు.

Also Read : YS Sharmila: తెలంగాణ గ‌డ్డ‌పైనే ష‌ర్మిల రాజ‌కీయం.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ఆర్‌ బిడ్డ‌!

సెంథిల్ ప్రస్తుతం వాయిస్ ఆఫ్ మణిపూర్ అనే పేరుతో మణిపూర్ లో ఏం జరుగుతోందనే విషయాన్ని దేశ ప్రజలకి తెలిసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చి పార్టీలో చేరిన సెంథిల్ ఇప్పటికే పార్టీ వ్యవస్థని పూర్తిగా అర్దం చేసుకున్నారని ఆ పార్టీ జాతీయ నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి  ( T Congress New Strategy) చాలా అనుకూలంగా ఉందని కొన్ని వ్యూహాలతో పార్టీని అధికారంలోకి తీసుకు రావచ్చని సెంథిల్ వార్ రూం సభ్యులతో చెబుతున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ అంత స్ట్రాంగ్ కాదని ఆ పార్టీని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని సెంథిల్ అభిప్రాయ పడుతున్నారట. ఆ పార్టీకి గ్రౌండ్ లెవల్ క్యాడర్ లేదని, తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ కార్యకర్తలు కనీసం 50 నుండి 100 మంది ఉన్నారట. అయితే పార్టీకి నాయకులకు, క్యాడర్ కి మధ్య కనెక్షన్ మిస్ అయిందని వాళ్ళని కనెక్ట్ చేయగలిగితే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కి తిరుగు ఉండదనేది సెంథిల్ చెపుతున్నారని కాంగ్రెస్ లోని చ‌ర్చ‌.

Also Read : BRS vs Congress : బుద్వేల్ భూముల వేలంపై కాంగ్రెస్ ఆగ్ర‌హం.. భూములు కొన్న‌వారంతా…?

పెద్ద లీడర్లు లెగ్ వర్క్ ఎక్కువగా చేస్తే క్యాడర్ కి రీచార్జ్ అవుతుందని ఆ తరహా పెద్ద లీడర్లందరూ నాలుగు నెలలు రోడ్లపై ఉండేలా కార్యక్రమాలు రూపొందించే పనిలో సెంథిల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాయకుల మధ్య సమన్వయం ఉండాల్సిందే అని సెంథిల్ చెప్పడంతోనే ఇటీవల కాంగ్రెస్ నేతలు ఐక్యతరాగం తీసుకున్నారని, ఆయన గైడెన్స్ ప్రకారమే అందరూ కలిసి బస్ యాత్ర ప్రకటించినట్లు తెలుస్తోంది.ఎన్నికల సమయానికి బీజేపీ విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందని దాన్ని అడ్డుకోవాలని, అధికార పార్టీని 30 శాతం కమీషన్ సర్కార్ అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ల‌డానికి కార్యక్రమాలు రూపొందించాలని తన వార్ రూం సభ్యులతో సెంథిల్ చెప్పినట్లు సమాచారం. కర్ణాటకలో సక్సెస్ అయిన సెంథిల్ మంత్రం తెలంగాణలో కూడా ప‌నిచేస్తుంద‌ని కాంగ్రెస్ న‌మ్ముతోంది.